Selulaala vaani suddi seppagure naadoda

చెలులాల వాని సుద్ది చెప్పకురే నాతోడ
Language

(॥పల్లవి॥)
చెలులాల వాని సుద్ది చెప్పకురే నాతోడ
పలుకుల వెంగమేలఁ దగ మేలుగాక

(॥చెలు॥)
మనసురానిచోటికి మంతనాలుఁ గొన్నా
మెనకులవాదులైన మేలుగాక
చనవులేని చొటికి సరసాలు గొన్నా
మునుకొన్నఅవ్వలిమోములు మేలుగాక

(॥చెలు॥)
గుఱుతుమఱచినచో కూటువమొక్కులు గొన్నా
మెఱయని తెరమాటే మేలుగాక
జఱయుచుండేటిచోట చనవులుచూపేవీఁ గొన్నా
కుఱకుఱబీరములగుట్టు మేలుగాక

(॥చెలు॥)
చిత్తజకేలిచోటను సిగ్గులునుఁ గొన్నా
యెత్తిన దేహ మొప్పించు టెక్కువగాక
హత్తిన శ్రీవేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
కోత్తగా నన్నియు నియ్యకొంట మేలుగాక

(||pallavi||)
sĕlulāla vāni suddi sĕppagure nādoḍa
palugula vĕṁgamelam̐ daga melugāga

(||sĕlu||)
manasurānisoḍigi maṁtanālum̐ gŏnnā
mĕnagulavādulaina melugāga
sanavuleni sŏḍigi sarasālu gŏnnā
munugŏnnaavvalimomulu melugāga

(||sĕlu||)
guṟudumaṟasinaso kūḍuvamŏkkulu gŏnnā
mĕṟayani tĕramāḍe melugāga
jaṟayusuṁḍeḍisoḍa sanavulusūbevīm̐ gŏnnā
kuṟaguṟabīramulaguṭṭu melugāga

(||sĕlu||)
sittajagelisoḍanu siggulunum̐ gŏnnā
yĕttina deha mŏppiṁchu ṭĕkkuvagāga
hattina śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍĕ
kottagā nanniyu niyyagŏṁṭa melugāga