చెలులాల చూడరే యీ చెలి భాగ్యము
(॥పల్లవి॥)
చెలులాల చూడరే యీ చెలి భాగ్యము
అలమేలుమంగ యీకె కబ్బెను యీ భాగ్యము
(॥చెలు॥)
పతిదయగలిగినపడఁతి దీభాగ్యము
అతఁడు మాటమీరనీ దది భాగ్యము
సతతముఁ బాయక జంటైవుండేది భాగ్యము
అతివలెందరుగల్లా నది యేమిచెప్పేరే
(॥చెలు॥)
మగండుమన్నించినమగువది భాగ్యము
సొగిసి యాతఁడు మోహించుట భాగ్యము
వెగటులేనిరతుల వేసరనిది భాగ్యము
మగువలవలపులు మరి యేమిచెప్పేరే
(॥చెలు॥)
శ్రీవేంకటేశుఁ డేలె మచ్చిక నీసతిది భాగ్య-
మావేళ నాతఁడు మెచ్చినది భాగ్యము
తావుకొని యెప్పుడూఁ దనవాఁడౌటే భాగ్యము
యేవనితలనేరుపు లిఁక నేమిచెప్పేరే
(||pallavi||)
sĕlulāla sūḍare yī sĕli bhāgyamu
alamelumaṁga yīgĕ kabbĕnu yī bhāgyamu
(||sĕlu||)
padidayagaliginabaḍam̐ti dībhāgyamu
adam̐ḍu māḍamīranī dadi bhāgyamu
sadatamum̐ bāyaga jaṁṭaivuṁḍedi bhāgyamu
adivalĕṁdarugallā nadi yemisĕppere
(||sĕlu||)
magaṁḍumanniṁchinamaguvadi bhāgyamu
sŏgisi yādam̐ḍu mohiṁchuḍa bhāgyamu
vĕgaḍuleniradula vesaranidi bhāgyamu
maguvalavalabulu mari yemisĕppere
(||sĕlu||)
śhrīveṁkaḍeśhum̐ ḍelĕ machchiga nīsadidi bhāgya-
māveḽa nādam̐ḍu mĕchchinadi bhāgyamu
tāvugŏni yĕppuḍūm̐ danavām̐ḍauḍe bhāgyamu
yevanidalanerubu lim̐ka nemisĕppere