చెలులాల చూడరే చెలువుని మన్ననలు
(॥పల్లవి॥)
చెలులాల చూడరే చెలువుని మన్ననలు
యెలమి నా భాగ్య మిఁక నేమని చెప్పుదునే
(॥చెలు॥)
ఆనలువెట్టి పిలిచి యాసలెంత రేఁచీనే
తా నెంత నే నెంత తమకించీని
ఆనుకొని నా వలపు ఆరడి నేల పెట్టీనే
మోనముతోఁ జేతులెత్తి మొక్కుతా నుందానను
(॥చెలు॥)
కాలు దొక్కి మనసెంత కరఁగించి చొక్కించీనే
యేలినవాఁడు తాను యిల్లాల నేను
మూలనున్న నా సిగ్గు ముంగిట నేలవేసీనే
గోలతనమున వేఁడుకొంటా నుందానను
(॥చెలు॥)
కూడి యంత సంతోసాన గుబ్బతిలఁ జేసీనే
వేడుకకు ముందే తను వెనక నేను
యీడనే శ్రీవేంకటేశుఁ డెనసి యాల మెచ్చీనే
ఆడ నీడాఁ దనుఁ గొనియాడుతానుందానను
(||pallavi||)
sĕlulāla sūḍare sĕluvuni mannanalu
yĕlami nā bhāgya mim̐ka nemani sĕppudune
(||sĕlu||)
ānaluvĕṭṭi pilisi yāsalĕṁta rem̐sīne
tā nĕṁta ne nĕṁta tamagiṁchīni
ānugŏni nā valabu āraḍi nela pĕṭṭīne
monamudom̐ jedulĕtti mŏkkudā nuṁdānanu
(||sĕlu||)
kālu dŏkki manasĕṁta karam̐giṁchi sŏkkiṁchīne
yelinavām̐ḍu tānu yillāla nenu
mūlanunna nā siggu muṁgiḍa nelavesīne
goladanamuna vem̐ḍugŏṁṭā nuṁdānanu
(||sĕlu||)
kūḍi yaṁta saṁtosāna gubbadilam̐ jesīne
veḍugagu muṁde tanu vĕnaga nenu
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍĕnasi yāla mĕchchīne
āḍa nīḍām̐ danum̐ gŏniyāḍudānuṁdānanu