చెలులాల చూడరే చెలియ చక్కఁదనము
(॥పల్లవి॥)
చెలులాల చూడరే చెలియ చక్కఁదనము
తలఁచరా దింతంతని తలఁచుకుండారాదు
(॥చెలు॥)
పోలుతమా జక్కవల పొలఁతి చన్నులు నేఁడు
పోలుచరా వవి పాయుఁ బొద్దుగుంకితే
మేలిమైన కురులు తుమ్మిదలని యందమా
ఆ లీల ననకు మవి యలుకు సంపెఁగలకు
(॥చెలు॥)
యీడౌనా యీపెతోడ లేపున ననంట్లతో
యీడు గావు పొరపొచ్చే లెంచితే నవి
జోడుసేతమా మొగము సొరదిఁ జంద్రునికిని
జోడుగాదు దినమొకజోకవాఁ డతఁడు
(॥చెలు॥)
యెనసేతమా చిగురు యీపె కరపాదాలకు
యెనసేయ కొకవేళ ఇవి ముదురు
పెనతమా యీలేమను ప్రేమ శ్రీ వేంకటేశుతో
పెనచనేల కూడిరి పెంపున నిద్దరును
(||pallavi||)
sĕlulāla sūḍare sĕliya sakkam̐danamu
talam̐sarā diṁtaṁtani talam̐suguṁḍārādu
(||sĕlu||)
poludamā jakkavala pŏlam̐ti sannulu nem̐ḍu
polusarā vavi pāyum̐ bŏdduguṁkide
melimaina kurulu tummidalani yaṁdamā
ā līla nanagu mavi yalugu saṁpĕm̐galagu
(||sĕlu||)
yīḍaunā yībĕdoḍa lebuna nanaṁṭlado
yīḍu gāvu pŏrabŏchche lĕṁchide navi
joḍusedamā mŏgamu sŏradim̐ jaṁdrunigini
joḍugādu dinamŏgajogavām̐ ḍadam̐ḍu
(||sĕlu||)
yĕnasedamā siguru yībĕ karabādālagu
yĕnaseya kŏgaveḽa ivi muduru
pĕnadamā yīlemanu prema śhrī veṁkaḍeśhudo
pĕnasanela kūḍiri pĕṁpuna niddarunu