Selulaala soodaramma sesinadi ledamduru

చెలులాల చూడరమ్మ చేసినది లేదందురు
Language

(॥పల్లవి॥)
చెలులాల చూడరమ్మ చేసినది లేదందురు
అలివేణిబొంకు కంటే అదె జాణతనము

(॥చెలు॥)
మొనమాట నే నాడితే మొలక నవ్వులు నవ్వీ
తన మనసెఱఁగని తగ వున్నదా
యెనసిన రమణుఁడు యెదుటనే వున్నాఁడు
అన నేమున్నది తన కదె జాణ తనము

(॥చెలు॥)
తప్పులు నేఁ బట్టితేను తానే పొందు సేయవచ్చీ
నెప్పున తా నేరనినేరు పున్నదా
చొప్పులెత్త నిద్దరికి చుట్ట మీడ నున్నవాఁడు
అప్పసము గాచుకున్న దదె జాణతనము

(॥చెలు॥)
మొగము నేఁ జూచితేను ముచ్చట సన్నలఁ జల్లీ
వెగటైన వినయాలు వెదచల్లఁడా
యెగ సక్కేన శ్రీ వేంకటేశుఁ డిట్టె మమ్ముఁ గూడె
ఆగడు దీర్చుకొనుట అదె జాణతనుమ

(||pallavi||)
sĕlulāla sūḍaramma sesinadi ledaṁduru
aliveṇibŏṁku kaṁṭe adĕ jāṇadanamu

(||sĕlu||)
mŏnamāḍa ne nāḍide mŏlaga navvulu navvī
tana manasĕṟam̐gani taga vunnadā
yĕnasina ramaṇum̐ḍu yĕduḍane vunnām̐ḍu
ana nemunnadi tana kadĕ jāṇa tanamu

(||sĕlu||)
tappulu nem̐ baṭṭidenu tāne pŏṁdu seyavachchī
nĕppuna tā neranineru punnadā
sŏppulĕtta niddarigi suṭṭa mīḍa nunnavām̐ḍu
appasamu gāsugunna dadĕ jāṇadanamu

(||sĕlu||)
mŏgamu nem̐ jūsidenu muchchaḍa sannalam̐ jallī
vĕgaḍaina vinayālu vĕdasallam̐ḍā
yĕga sakkena śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕ mammum̐ gūḍĕ
āgaḍu dīrsugŏnuḍa adĕ jāṇadanuma