చెలులాల చచూడరే చెలువుని బాగులెల్లా
(॥పల్లవి॥)
చెలులాల చచూడరే చెలువుని బాగులెల్లా
నిలువుఁ జక్కఁదనాల నిలుచున్నాఁ డీడను
(॥॥)
ఇయ్యఁగదే విడెము యిందాఁకా నేడ నుండెనే
నెయ్యపు రమణుఁడంటా నే నుంటిని
పయ్య దంటవచ్చీని పలుమారు నన్నుఁ జూచి
కొయ్యతనాలు నేరిచె గొంకఁడేమిటికిని
(॥॥)
అడుగవే సుద్దులు ఆడ నుండి తా వచ్చె
నడుమఁ దనప్రియాలు నమ్మితిని
వొడివట్టి పెనఁగీని వొనరి సంతోసాన
గడుసాయఁ జేఁతలను కరఁగఁ డెంతయినా
(॥॥)
మొక్కవే నామారు ముంచి నన్నిటు గూడె
యిక్కడ శ్రీ వేంకటేశు కిరవైతిని
అక్కరతో మన్నించీని అలమేలుమంగ నేను
తక్కక రతుల మించీ దంట తనమునను
(||pallavi||)
sĕlulāla sasūḍare sĕluvuni bāgulĕllā
niluvum̐ jakkam̐danāla nilusunnām̐ ḍīḍanu
(||||)
iyyam̐gade viḍĕmu yiṁdām̐kā neḍa nuṁḍĕne
nĕyyabu ramaṇum̐ḍaṁṭā ne nuṁṭini
payya daṁṭavachchīni palumāru nannum̐ jūsi
kŏyyadanālu nerisĕ gŏṁkam̐ḍemiḍigini
(||||)
aḍugave suddulu āḍa nuṁḍi tā vachchĕ
naḍumam̐ danapriyālu nammidini
vŏḍivaṭṭi pĕnam̐gīni vŏnari saṁtosāna
gaḍusāyam̐ jem̐talanu karam̐gam̐ ḍĕṁtayinā
(||||)
mŏkkave nāmāru muṁchi nanniḍu gūḍĕ
yikkaḍa śhrī veṁkaḍeśhu kiravaidini
akkarado manniṁchīni alamelumaṁga nenu
takkaga radula miṁchī daṁṭa tanamunanu