Selulaala ramanuni semtalellaam jellaneere

చెలులాల రమణుని చేఁతలెల్లాఁ జెల్లనీరే
Language

(॥పల్లవి॥)
చెలులాల రమణుని చేఁతలెల్లాఁ జెల్లనీరే
కెలనికిఁ జూడ మిక్కిలి వన్నెగాదా

(॥చెలు॥)
చెలిమి సేసినవాఁడు సెలవుల నగనీరే
చలపట్టి యందుకెల్లా సాదించేనా
కలసిమెలసివున్న ఘనుఁడు చెనకనీవే
పెలుచనై యాతనితోఁ బెనఁగులాడేనా

(॥చెలు॥)
కూరిమిగలుగువాఁడు కొచ్చి కొచ్చి చూడనీరే
గోరనూఁది యందుకు నే గుంపించేనా
చేరి పాయనట్టివాఁడు సిగ్గులెల్లా రేఁచనీవే
దారకురాలనై తన్నుఁ దగ దనేనా

(॥చెలు॥)
చుట్ట మైనయట్టివాఁడు సుద్దులెల్లాఁ జెప్పనీవే
దిట్టనై నే నందుకెల్లా దేకొనేనా
యిట్టె శ్రీవేంకటేశ్వరుఁ డెనసె జొక్కించనీవే
అట్టె గర్వపుదాననై యవుఁగాదనేనా

(||pallavi||)
sĕlulāla ramaṇuni sem̐talĕllām̐ jĕllanīre
kĕlanigim̐ jūḍa mikkili vannĕgādā

(||sĕlu||)
sĕlimi sesinavām̐ḍu sĕlavula naganīre
salabaṭṭi yaṁdugĕllā sādiṁchenā
kalasimĕlasivunna ghanum̐ḍu sĕnaganīve
pĕlusanai yādanidom̐ bĕnam̐gulāḍenā

(||sĕlu||)
kūrimigaluguvām̐ḍu kŏchchi kŏchchi sūḍanīre
goranūm̐di yaṁdugu ne guṁpiṁchenā
seri pāyanaṭṭivām̐ḍu siggulĕllā rem̐sanīve
dāragurālanai tannum̐ daga danenā

(||sĕlu||)
suṭṭa mainayaṭṭivām̐ḍu suddulĕllām̐ jĕppanīve
diṭṭanai ne naṁdugĕllā degŏnenā
yiṭṭĕ śhrīveṁkaḍeśhvarum̐ ḍĕnasĕ jŏkkiṁchanīve
aṭṭĕ garvabudānanai yavum̐gādanenā