చెలులాల రమణుఁడు చిత్తగించీ నలవాఁడె
(॥పల్లవి॥)
చెలులాల రమణుఁడు చిత్తగించీ నలవాఁడె
మెలఁగి సేవ సేయరే మెచ్చీ నిందరిని
(॥॥)
మంచి మాట లాడవలె మనసు గరఁచవలె
కంచపు మో వియ్యవలె కాంతునికి
పంచనతో మొక్కవలె వద్దఁ గాచుకుండవలె
కొంచక లోనికి రారే కొలువు వేళాయను
(॥॥)
యిచ్చకము చూపవలె నింపులే నెరపవలె
మచ్చిక నవ్వఁగవలె మగనితోను
కచ్చు పెట్టు కుండవలె కానుక లందుకోవలె
కొచ్చి విన్నవించరే కొలువు వేళాయను
(॥॥)
వేడుకలు రేఁచవలె వెస నలమేల్మంగకు
వీడె మియ్యవలె శ్రీవేంకటేశుకు
యీడుకుఁ బొగడవలె యిద్దరును ముద్దువలె
గూడిరి తెరదీయరే కొలువు వేళాయన
(||pallavi||)
sĕlulāla ramaṇum̐ḍu sittagiṁchī nalavām̐ḍĕ
mĕlam̐gi seva seyare mĕchchī niṁdarini
(||||)
maṁchi māḍa lāḍavalĕ manasu garam̐savalĕ
kaṁchabu mo viyyavalĕ kāṁtunigi
paṁchanado mŏkkavalĕ vaddam̐ gāsuguṁḍavalĕ
kŏṁchaga lonigi rāre kŏluvu veḽāyanu
(||||)
yichchagamu sūbavalĕ niṁpule nĕrabavalĕ
machchiga navvam̐gavalĕ maganidonu
kachchu pĕṭṭu kuṁḍavalĕ kānuga laṁdugovalĕ
kŏchchi vinnaviṁchare kŏluvu veḽāyanu
(||||)
veḍugalu rem̐savalĕ vĕsa nalamelmaṁgagu
vīḍĕ miyyavalĕ śhrīveṁkaḍeśhugu
yīḍugum̐ bŏgaḍavalĕ yiddarunu mudduvalĕ
gūḍiri tĕradīyare kŏluvu veḽāyana