Selulaala padim gakkasimchagure palumaaru

చెలులాల పతిఁ గక్కసించకురే పలుమారు
Language

(॥పల్లవి॥)
చెలులాల పతిఁ గక్కసించకురే పలుమారు
యెలమి తోడుతఁ దొల్లె యేలినాఁడు నన్నును

(॥చెలు॥)
మరిగించి వొకమాఁటు మనసు వెట్టితేఁ జాలు
తరవాతిపనులెల్లా తా నెరుఁగును
గరిమ నాసలతోడఁ గన్నులఁ జూచితేఁ జాలు
వెరవులు పచరించి విన్నవించవలదు

(॥చెలు॥)
మిక్కు టమైన వయసు మీఁదుకట్టితేఁ జాలు
మక్కువఁ దానే మరి మన్నించీని
అక్కరతో నేపొద్దునండ నుండితేఁ జాలు
పక్కన నిండుమోహము పచారించవలదు

(॥చెలు॥)
సేయఁగల చేఁతలెల్లా సెలవు సేసితేఁ జాలు
చాయకువచ్చి తానే సతమయ్యాని
యాయెడ శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్నేలినాఁడు
చేయి చాఁచి సారెసారెఁ జెనకఁగ వలదు

(||pallavi||)
sĕlulāla padim̐ gakkasiṁchagure palumāru
yĕlami toḍudam̐ dŏllĕ yelinām̐ḍu nannunu

(||sĕlu||)
marigiṁchi vŏgamām̐ṭu manasu vĕṭṭidem̐ jālu
taravādibanulĕllā tā nĕrum̐gunu
garima nāsaladoḍam̐ gannulam̐ jūsidem̐ jālu
vĕravulu pasariṁchi vinnaviṁchavaladu

(||sĕlu||)
mikku ṭamaina vayasu mīm̐dugaṭṭidem̐ jālu
makkuvam̐ dāne mari manniṁchīni
akkarado nebŏddunaṁḍa nuṁḍidem̐ jālu
pakkana niṁḍumohamu pasāriṁchavaladu

(||sĕlu||)
seyam̐gala sem̐talĕllā sĕlavu sesidem̐ jālu
sāyaguvachchi tāne sadamayyāni
yāyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannelinām̐ḍu
seyi sām̐si sārĕsārĕm̐ jĕnagam̐ga valadu