చెలులాల నేనతని చెంగటనే వుండేఁ గాని
(॥పల్లవి॥)
చెలులాల నేనతని చెంగటనే వుండేఁ గాని
పిలిచి బంగారము పీఁట వెట్టరే
(॥॥)
మొగమోటదాన నేను మోహించినదాన నేను
అగడుగాఁ బతి నేమీ నాడఁ జాలనే
నగవు వచ్చు నాకు నంటున మాటలాడితే
మిగులాఁ దనతలఁపు మీరే యడుగరే
(॥॥)
యెమ్మెలేనిదాన నేను ఇచ్చకపుదాన నేను
వుమ్మడిదంటతనాన నొరయఁజాల
కమ్ముకొనీ సిగ్గు నాకుఁ గానుకిచ్చేనంటేను
నిమ్మపండ్లివే రెండు నేఁడు మీరె యియ్యరే
(॥॥)
దేవులైనదాన నేను తేజపుదాన నేను
శ్రీవేంకటేశ్వరు గోరఁ జెనకంజాల
కావించి నన్నేలె మతిగరఁగీ గొసరేనంటే
యీవల నాపొందు మీరే యీడేరించమనరే
(||pallavi||)
sĕlulāla nenadani sĕṁgaḍane vuṁḍem̐ gāni
pilisi baṁgāramu pīm̐ṭa vĕṭṭare
(||||)
mŏgamoḍadāna nenu mohiṁchinadāna nenu
agaḍugām̐ badi nemī nāḍam̐ jālane
nagavu vachchu nāgu naṁṭuna māḍalāḍide
migulām̐ danadalam̐pu mīre yaḍugare
(||||)
yĕmmĕlenidāna nenu ichchagabudāna nenu
vummaḍidaṁṭadanāna nŏrayam̐jāla
kammugŏnī siggu nāgum̐ gānugichchenaṁṭenu
nimmabaṁḍlive rĕṁḍu nem̐ḍu mīrĕ yiyyare
(||||)
devulainadāna nenu tejabudāna nenu
śhrīveṁkaḍeśhvaru goram̐ jĕnagaṁjāla
kāviṁchi nannelĕ madigaram̐gī gŏsarenaṁṭe
yīvala nābŏṁdu mīre yīḍeriṁchamanare