చెలులాల నాయకుని చిత్తము గాక
(॥పల్లవి॥)
చెలులాల నాయకుని చిత్తము గాక
తలఁపించేనా బాసలు తనతో నేను
(॥చెలు॥)
జగములేలేవాఁడు జవ్వనమదమువాఁడు
నగితే నే సరిగాను నవ్వఁగలనా
పగటుఁ జుట్టుఁగైదువపట్టినచేతివాఁడు
తగవులాడఁగలనా తనతో నేను
(॥చెలు॥)
వేవేలుసతులవాఁడు వెన్నెలచూపులవాఁడు
వావులు చెప్పి వరుసవంతడిగేనా
కోవరపుకాసులఁ గొట్టిన వొరటువాఁడు
తావళించి వొరసేనా తనతో నేను
(॥చెలు॥)
నాలుగుచేతులవాఁడు నాగశయనపువాఁడు
బేలుఁదనమున సరిపెనఁగేనా
యీలీల శ్రీవేంకటేశుఁ డిటు తానే నన్నుఁ గూడె
దైలతో నే గొసరేనా తనతో నేను
(||pallavi||)
sĕlulāla nāyaguni sittamu gāga
talam̐piṁchenā bāsalu tanado nenu
(||sĕlu||)
jagamulelevām̐ḍu javvanamadamuvām̐ḍu
nagide ne sarigānu navvam̐galanā
pagaḍum̐ juṭṭum̐gaiduvabaṭṭinasedivām̐ḍu
tagavulāḍam̐galanā tanado nenu
(||sĕlu||)
vevelusadulavām̐ḍu vĕnnĕlasūbulavām̐ḍu
vāvulu sĕppi varusavaṁtaḍigenā
kovarabugāsulam̐ gŏṭṭina vŏraḍuvām̐ḍu
tāvaḽiṁchi vŏrasenā tanado nenu
(||sĕlu||)
nālugusedulavām̐ḍu nāgaśhayanabuvām̐ḍu
belum̐danamuna saribĕnam̐genā
yīlīla śhrīveṁkaḍeśhum̐ ḍiḍu tāne nannum̐ gūḍĕ
dailado ne gŏsarenā tanado nenu