చెలులాల మీరూరకే చేతికి కానికియ్యరే
(॥పల్లవి॥)
చెలులాల మీరూరకే చేతికి కానికియ్యరే
తలఁచుకొని యన్నిటాఁ దానే మన్నించీని
(॥చెలు॥)
పిలిపించ నెంతదాన సెనఁగఁగ నెంతదాన
తలఁపులోపలివాఁడు తానే వచ్చీని
చెలరేఁగి పెండ్లాడినాడు చేపట్టినాఁడు తొల్లె
కొలచినందే కొలచి కొత్తసేయవలెనా
(॥చెలు॥)
అగడుసేయఁగనేల ఆకులు వ్రాశంపనేల
తగులాయమైనవాఁడు తానే వచ్చీని
నగి సేసవెట్టినాఁడు నమ్మించినాఁడు తొల్లె
విగిడినందే విగిడి నిందవేయవలెనా
(॥చెలు॥)
చొక్కించఁగా నెట్టో సొలయఁగా నది యెట్టో
దక్కి నాకుఁ గలవాఁడు తానే వచ్చీని
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డితఁడే వచ్చి నన్నేలె
మొక్కినందే మొక్కి మరి మోపుగట్టవలెనా
(||pallavi||)
sĕlulāla mīrūrage sedigi kānigiyyare
talam̐sugŏni yanniḍām̐ dāne manniṁchīni
(||sĕlu||)
pilibiṁcha nĕṁtadāna sĕnam̐gam̐ga nĕṁtadāna
talam̐pulobalivām̐ḍu tāne vachchīni
sĕlarem̐gi pĕṁḍlāḍināḍu sebaṭṭinām̐ḍu tŏllĕ
kŏlasinaṁde kŏlasi kŏttaseyavalĕnā
(||sĕlu||)
agaḍuseyam̐ganela āgulu vrāśhaṁpanela
tagulāyamainavām̐ḍu tāne vachchīni
nagi sesavĕṭṭinām̐ḍu nammiṁchinām̐ḍu tŏllĕ
vigiḍinaṁde vigiḍi niṁdaveyavalĕnā
(||sĕlu||)
sŏkkiṁcham̐gā nĕṭṭo sŏlayam̐gā nadi yĕṭṭo
dakki nāgum̐ galavām̐ḍu tāne vachchīni
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe vachchi nannelĕ
mŏkkinaṁde mŏkki mari mobugaṭṭavalĕnā