Selulaala meerimtela seppe raadanigi buddhi

చెలులాల మీరింతేల చెప్పే రాతనికి బుద్ధి
Language

(॥పల్లవి॥)
చెలులాల మీరింతేల చెప్పే రాతనికి బుద్ధి
చలివలపులు చల్లి జాగులు సేసీనా

(॥చెలు॥)
సేస వెట్టినట్టివాఁడుచేరి కాఁగిలించుఁ గాక
ఆసలాసలె రేఁచి అట్టె వుండీనా
వాసి వుటించినవాడు వడిఁ జింత మిచ్చుఁ గాక
బేసబెల్లితనమున బిగువు లాడీనా

(॥చెలు॥)
ససర మాడినవాఁడు చన విచ్చి కూడుఁ గాక
తరఁగుమరఁగు లాడి తక్కి వుండీనా
కరఁగి మెచ్చినవాఁడు కందువకుఁ దీసుఁ గాక
సరవు లెరంగక సాదించీనా

(॥చెలు॥)
దగ్గరి వచ్చినవాఁడు దయ నాపైఁ జేసుఁ గాక
సిగ్గులు వడుచు వేరె చిమ్మి రేఁచీనా
యెగ్గు దీర శ్రీవెంటేశుడిట్టె నన్నుఁ గూడె
వొగ్గి నా సొమ్మాయఁ గాక వొల్ల ననీనా

(||pallavi||)
sĕlulāla mīriṁtela sĕppe rādanigi buddhi
salivalabulu salli jāgulu sesīnā

(||sĕlu||)
sesa vĕṭṭinaṭṭivām̐ḍuseri kām̐giliṁchum̐ gāga
āsalāsalĕ rem̐si aṭṭĕ vuṁḍīnā
vāsi vuḍiṁchinavāḍu vaḍim̐ jiṁta michchum̐ gāga
besabĕllidanamuna biguvu lāḍīnā

(||sĕlu||)
sasara māḍinavām̐ḍu sana vichchi kūḍum̐ gāga
taram̐gumaram̐gu lāḍi takki vuṁḍīnā
karam̐gi mĕchchinavām̐ḍu kaṁduvagum̐ dīsum̐ gāga
saravu lĕraṁgaga sādiṁchīnā

(||sĕlu||)
daggari vachchinavām̐ḍu daya nābaim̐ jesum̐ gāga
siggulu vaḍusu verĕ simmi rem̐sīnā
yĕggu dīra śhrīvĕṁṭeśhuḍiṭṭĕ nannum̐ gūḍĕ
vŏggi nā sŏmmāyam̐ gāga vŏlla nanīnā