Selulaala meere yimta sesidi riddari nemdu

చెలులాల మీరె యింత సేసితి రిద్దరి నేఁడు
Language

(॥పల్లవి॥)
చెలులాల మీరె యింత సేసితి రిద్దరి నేఁడు
కలయని మాసటీలఁ గదియింతురా

(॥చెలులాల॥)
తక్కరీఁ డంటిఁ గదవే దంట వీఁ డంటిఁ గదవే
అక్కడికతలే చెప్పీ నంటిఁ గదవే
యెక్కువ నాతో నాడేదె మాఁటకె మాఁట
యిక్కడికి వచ్చు టెల్ల యిందుకొరకా

(॥చెలులాల॥)
చలమరి యంటిఁ గదే చల్లజం పంటిఁ గదవే
అలపు సొలపె ఘన మంటిఁ గదవే
తలవాకిటనె వుండి తనకు నా కేఁటి పొందే
వలపు నామీఁదఁ జల్లేవరుసా యిది

(॥చెలులాల॥)
వేసదారి యంటిఁ గదే వేగిరకాఁ డంటిఁ గదే
ఆసలు చూపిన లో నౌ నంటిఁ గదవే
బాసతో శ్రీవెంకటాదిపతి నిన్ను నిటు గూడె
మోస మెల్లఁ దీరె నింక మొక్కెంచేరా

(||pallavi||)
sĕlulāla mīrĕ yiṁta sesidi riddari nem̐ḍu
kalayani māsaḍīlam̐ gadiyiṁturā

(||sĕlulāla||)
takkarīm̐ ḍaṁṭim̐ gadave daṁṭa vīm̐ ḍaṁṭim̐ gadave
akkaḍigadale sĕppī naṁṭim̐ gadave
yĕkkuva nādo nāḍedĕ mām̐ṭagĕ mām̐ṭa
yikkaḍigi vachchu ṭĕlla yiṁdugŏragā

(||sĕlulāla||)
salamari yaṁṭim̐ gade sallajaṁ paṁṭim̐ gadave
alabu sŏlabĕ ghana maṁṭim̐ gadave
talavāgiḍanĕ vuṁḍi tanagu nā kem̐ṭi pŏṁde
valabu nāmīm̐dam̐ jallevarusā yidi

(||sĕlulāla||)
vesadāri yaṁṭim̐ gade vegiragām̐ ḍaṁṭim̐ gade
āsalu sūbina lo nau naṁṭim̐ gadave
bāsado śhrīvĕṁkaḍādibadi ninnu niḍu gūḍĕ
mosa mĕllam̐ dīrĕ niṁka mŏkkĕṁcherā