Selulaala meerainaam jeppare buddi

చెలులాల మీరైనాఁ జెప్పరే బుద్ది
Language

(॥పల్లవి॥)
చెలులాల మీరైనాఁ జెప్పరే బుద్ది
చలమున్నియు మాని సరసమాడితిని

(॥చెలు॥)
యెప్పటికెప్పటిమాటలేల తలఁచుకొనీనే
చిప్పిలుచు లోలో నేల చెమరించీనే
తప్పులేదంటానేల తారుకాణించవచ్చీనే
అప్పుడే అన్నిమరచి అందాలఁ గూడితివి

(॥చెలు॥)
యెక్కడి కెక్కడిపనులేల నిలువఁబెట్టీనే
వుక్కుమీరి తానేల వుస్సురనీనే
నిక్కమిందంటానేల నిండా నానలు వెట్టీనే
చక్కనై అలుకదేరి చవిసేసుకొంటివి

(॥చెలు॥)
యేడనేడ తగవులు యిందునేల కలపీనే
వోడక తానేల నాపై వొళ్ళు వేసీనే
కూడి శ్రీవేంకటేశుఁడు గురుతులేల నించీనే
ఆడానీడాఁ తెలుసుక అన్నిటా నమ్మితిని

(||pallavi||)
sĕlulāla mīrainām̐ jĕppare buddi
salamunniyu māni sarasamāḍidini

(||sĕlu||)
yĕppaḍigĕppaḍimāḍalela talam̐sugŏnīne
sippilusu lolo nela sĕmariṁchīne
tappuledaṁṭānela tārugāṇiṁchavachchīne
appuḍe annimarasi aṁdālam̐ gūḍidivi

(||sĕlu||)
yĕkkaḍi kĕkkaḍibanulela niluvam̐bĕṭṭīne
vukkumīri tānela vussuranīne
nikkamiṁdaṁṭānela niṁḍā nānalu vĕṭṭīne
sakkanai alugaderi savisesugŏṁṭivi

(||sĕlu||)
yeḍaneḍa tagavulu yiṁdunela kalabīne
voḍaga tānela nābai vŏḽḽu vesīne
kūḍi śhrīveṁkaḍeśhum̐ḍu gurudulela niṁchīne
āḍānīḍām̐ tĕlusuga anniḍā nammidini