చెలులాల మీ రతఁడు సేసినట్టే సేయనీరె
(॥పల్లవి॥)
చెలులాల మీ రతఁడు సేసినట్టే సేయనీరె
అలుక లన్నియుఁ బాసె నడ్డమిఁక రాకురే
(॥చెలు॥)
చిన్నఁబోయి నే నుండఁగఁ జెయివట్టి తీసెఁబతి
అన్ని నేరములుఁ బాసె నందువంకనే
యెన్నియైనాఁ జేయనీవే యింత చాలదా నాకు
నున్నఁగా నూఁటికి నొక్కనూలిపోగే కాదా
(॥చెలుల॥)
వుప్పతిల్లు మదనాగ్ని నున్నఁ నన్నుఁ గాఁగిలించె
అప్పటి తాపము మానె నందువంకనే
యెప్పటికప్పుడే కాక యిఁక నేలే తొల్లిటివి
తప్పులెల్ల దీరు నొకదండ ననే కాదా
(॥చెలు॥)
కడుఁబాసి వున్న నన్నుఁగరుణించి తాఁ గూడె
అడరి సంతోసించితి నందువంకనే
యెడయఁడు శ్రీవేంకటేశుఁడు నన్నునేలె
నుడుగులలోనే కాదా నోముల ఫలములు
(||pallavi||)
sĕlulāla mī radam̐ḍu sesinaṭṭe seyanīrĕ
aluga lanniyum̐ bāsĕ naḍḍamim̐ka rāgure
(||sĕlu||)
sinnam̐boyi ne nuṁḍam̐gam̐ jĕyivaṭṭi tīsĕm̐badi
anni neramulum̐ bāsĕ naṁduvaṁkane
yĕnniyainām̐ jeyanīve yiṁta sāladā nāgu
nunnam̐gā nūm̐ṭigi nŏkkanūliboge kādā
(||sĕlula||)
vuppadillu madanāgni nunnam̐ nannum̐ gām̐giliṁchĕ
appaḍi tābamu mānĕ naṁduvaṁkane
yĕppaḍigappuḍe kāga yim̐ka nele tŏlliḍivi
tappulĕlla dīru nŏgadaṁḍa nane kādā
(||sĕlu||)
kaḍum̐bāsi vunna nannum̐garuṇiṁchi tām̐ gūḍĕ
aḍari saṁtosiṁchidi naṁduvaṁkane
yĕḍayam̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu nannunelĕ
nuḍugulalone kādā nomula phalamulu