Selulaala koridu seri nudimchamga

చెలులాల కోరిటు చేరి నుతించఁగ
Language

(॥పల్లవి॥)
చెలులాల కోరిటు చేరి నుతించఁగ
అలమేల్మంగకు నమరినది

(॥చెలు॥)
పూవుబాణములు పొదినేసె మరుఁడు
కావవి నవ్వులు కాంతవి
భావించ మందపవనుఁడు మలసెను
తావివూరు పిది తరుణిది

(॥చెలు॥)
మొదల నారదుఁడు మోయించె వీణెను
అదిగాదు మాఁట లంగనవి
చదల నదివో యరసంజ వొడమె నిటు
మదరాగము లవి మానినివి

(॥చెలు॥)
మెఱుఁగులు మెరచీ మింటను మేఘము
యెఱఁగలేరు కళ లింతివి
అఱిముఱితీగె మాకంటెను కా దింతి
యెఱుకల శ్రీ వేంకటేశునిఁ గూడె

(||pallavi||)
sĕlulāla koriḍu seri nudiṁcham̐ga
alamelmaṁgagu namarinadi

(||sĕlu||)
pūvubāṇamulu pŏdinesĕ marum̐ḍu
kāvavi navvulu kāṁtavi
bhāviṁcha maṁdabavanum̐ḍu malasĕnu
tāvivūru pidi taruṇidi

(||sĕlu||)
mŏdala nāradum̐ḍu moyiṁchĕ vīṇĕnu
adigādu mām̐ṭa laṁganavi
sadala nadivo yarasaṁja vŏḍamĕ niḍu
madarāgamu lavi māninivi

(||sĕlu||)
mĕṟum̐gulu mĕrasī miṁṭanu meghamu
yĕṟam̐galeru kaḽa liṁtivi
aṟimuṟidīgĕ māgaṁṭĕnu kā diṁti
yĕṟugala śhrī veṁkaḍeśhunim̐ gūḍĕ