చెలులాల బుద్దు లేమి చెప్పేరే మీరు నాకు
(॥పల్లవి॥)
చెలులాల బుద్దు లేమి చెప్పేరే మీరు నాకు
కలిగె నాతని పొందు కాణాచిగా నాకు
(॥చెలు॥)
మెగము చూచినప్పుడే మొనపెఁ జుట్టరికము
నగితేనే వలపులు నాటుకొనెను
తగిలి వద్దఁ గూచుంటే దైవారె వావులు
బిగిసి వట్టి సిగ్గులు పెంచనిఁకనేఁటికే
(॥చెలు॥)
సరసమాడి నప్పుడే సతమాయ ననుపులు
తెరలోనికి వచ్చితే తేరెఁ బనులు
పరపుపై నెక్కితేనే బలువాయ సంగాతాలు
నిరతి నిఁకఁ బంతాలు నెరపఁగనేఁటికే
(॥చెలు॥)
వీడె మందుకొన్నప్పుడే వేడుకలెల్లా నీడేరె
జోడుగా మాఁటాడితేనే చొక్కె మనసు
యీడనె శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
యేడలేని తరితీపు లెంచ నిఁకనేఁటికే
(||pallavi||)
sĕlulāla buddu lemi sĕppere mīru nāgu
kaligĕ nādani pŏṁdu kāṇāsigā nāgu
(||sĕlu||)
mĕgamu sūsinappuḍe mŏnabĕm̐ juṭṭarigamu
nagidene valabulu nāḍugŏnĕnu
tagili vaddam̐ gūsuṁṭe daivārĕ vāvulu
bigisi vaṭṭi siggulu pĕṁchanim̐kanem̐ṭige
(||sĕlu||)
sarasamāḍi nappuḍe sadamāya nanubulu
tĕralonigi vachchide terĕm̐ banulu
parabubai nĕkkidene baluvāya saṁgādālu
niradi nim̐kam̐ baṁtālu nĕrabam̐ganem̐ṭige
(||sĕlu||)
vīḍĕ maṁdugŏnnappuḍe veḍugalĕllā nīḍerĕ
joḍugā mām̐ṭāḍidene sŏkkĕ manasu
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
yeḍaleni taridību lĕṁcha nim̐kanem̐ṭige