Selulaala balumulu seyavachchunaa

చెలులాల బలుములు సేయవచ్చునా
Language

(॥పల్లవి॥)
చెలులాల బలుములు సేయవచ్చునా
చెలఁగి యేలే విభుని చిత్త మింతేకాక

(॥చెలు॥)
పంతమాడ నేఁటికి పాయపువారికిని
కంతుఁడు యేమిసేసునో కనే దెట్టు
యింతులు సిగ్గరికత్తె లేతులంటె నారజము
చెంత నున్నరమణుని చిత్త మింతేకాక

(॥చెలు॥)
చలపట్ట నేఁటికి సతియైనదానికిని
వల పెంతకుఁ దెచ్చునో వద్దనరాదు
నెలఁతలు గుట్టువారు నిష్టూరములు బాఁతిగాదు
చెలిమి సేసినపతి చిత్తమింతేకాక

(॥చెలు॥)
బిగియఁగ నేఁటికి ప్రియముగలదానికి
మొగమో టేడనుండునో రఁగాదు
మగువ లిచ్చకురాండ్లు మహి నిట్టె నన్నుఁగూడె
జిగి శ్రీవేంకటేశ్వరు చిత్తమింతేకాక

(||pallavi||)
sĕlulāla balumulu seyavachchunā
sĕlam̐gi yele vibhuni sitta miṁtegāga

(||sĕlu||)
paṁtamāḍa nem̐ṭigi pāyabuvārigini
kaṁtum̐ḍu yemisesuno kane dĕṭṭu
yiṁtulu siggarigattĕ ledulaṁṭĕ nārajamu
sĕṁta nunnaramaṇuni sitta miṁtegāga

(||sĕlu||)
salabaṭṭa nem̐ṭigi sadiyainadānigini
vala pĕṁtagum̐ dĕchchuno vaddanarādu
nĕlam̐talu guṭṭuvāru niṣhṭūramulu bām̐tigādu
sĕlimi sesinabadi sittamiṁtegāga

(||sĕlu||)
bigiyam̐ga nem̐ṭigi priyamugaladānigi
mŏgamo ṭeḍanuṁḍuno ram̐gādu
maguva lichchagurāṁḍlu mahi niṭṭĕ nannum̐gūḍĕ
jigi śhrīveṁkaḍeśhvaru sittamiṁtegāga