(॥పల్లవి॥)
చెలులాల బలిమిసేసేరు గాని
బలిమి వలచితే పసలేదు సుమ్మీ
(॥చెలు॥)
ఆడినమాఁటకును నడ్డము చెప్పక
కూడేఁగాని కొరతసుమ్మీ
వోడక పిలువఁగ వూఁకొంటిఁ గాని
జాడతో గదిసిన చవిగాదు సుమ్మీ
(॥చెలు॥)
తానే యీవేశ తగులఁగ నలుకలు
మానేఁ గాని మఱచు సుమ్మీ
పూని మొక్కఁగా పొదిగితిఁగాని
కానీలే తనమతి గానఁ జుమ్మీ
(॥చెలు॥)
కాఁగిట నించఁగ కదిసేఁ గాని
చేఁగ పంతములు చెల్లె సుమ్మీ
వీఁగక యిటు శ్రీ వేంకటపతిగాన
నాఁగువార నే నవ్వేఁ జుమ్మీ
(||pallavi||)
sĕlulāla balimiseseru gāni
balimi valaside pasaledu summī
(||sĕlu||)
āḍinamām̐ṭagunu naḍḍamu sĕppaga
kūḍem̐gāni kŏradasummī
voḍaga piluvam̐ga vūm̐kŏṁṭim̐ gāni
jāḍado gadisina savigādu summī
(||sĕlu||)
tāne yīveśha tagulam̐ga nalugalu
mānem̐ gāni maṟasu summī
pūni mŏkkam̐gā pŏdigidim̐gāni
kānīle tanamadi gānam̐ jummī
(||sĕlu||)
kām̐giḍa niṁcham̐ga kadisem̐ gāni
sem̐ga paṁtamulu sĕllĕ summī
vīm̐gaga yiḍu śhrī veṁkaḍabadigāna
nām̐guvāra ne navvem̐ jummī