చెలుల చనవులెల్లాఁ జెల్లించవలెఁ గాక
(॥పల్లవి॥)
చెలుల చనవులెల్లాఁ జెల్లించవలెఁ గాక
యెలమి మారు మలసేదింత నీకు వలెనా
(॥చెలు॥)
వలచినతమకాన వలసినట్లంటేను
చలము సాదింతురా సతితోడను
నిలువెల్లఁ జెమరించి నీమీఁద సొలసితే
పలుమారు నీకు నెగ్గుపట్టఁ దగునా
(॥చెలు॥)
సేవ సేసేవేగిరానఁ జెయిగాలుఁ దాఁకితేను
కావరించి తిట్టుదురా కలికి నింత
వావిగలుగఁగఁ జూచి వచ్చి సరసమాడితే
భావించి అందుకు నీవు పంతమాడఁ దగునా
(॥చెలు॥)
కూడిన నిబ్బరమున గురుతులు సోఁకితేను
సూడుకుఁ బట్టుదురా సుదతి నేఁడు
జోడై శ్రీ వేంకటేశ సొమ్ముతో నురమెక్కితే
ఆడినట్టాడుట గాక అలయఁగఁ దగునో
(||pallavi||)
sĕlula sanavulĕllām̐ jĕlliṁchavalĕm̐ gāga
yĕlami māru malasediṁta nīgu valĕnā
(||sĕlu||)
valasinadamagāna valasinaṭlaṁṭenu
salamu sādiṁturā sadidoḍanu
niluvĕllam̐ jĕmariṁchi nīmīm̐da sŏlaside
palumāru nīgu nĕggubaṭṭam̐ dagunā
(||sĕlu||)
seva sesevegirānam̐ jĕyigālum̐ dām̐kidenu
kāvariṁchi tiṭṭudurā kaligi niṁta
vāvigalugam̐gam̐ jūsi vachchi sarasamāḍide
bhāviṁchi aṁdugu nīvu paṁtamāḍam̐ dagunā
(||sĕlu||)
kūḍina nibbaramuna gurudulu som̐kidenu
sūḍugum̐ baṭṭudurā sudadi nem̐ḍu
joḍai śhrī veṁkaḍeśha sŏmmudo nuramĕkkide
āḍinaṭṭāḍuḍa gāga alayam̐gam̐ daguno