Selula mumdara nimta sesevugaaga

చెలుల ముందర నింత సేసేవుగాక
Language

(॥పల్లవి॥)
చెలుల ముందర నింత సేసేవుగాక
వలపు లోడిఁ గట్టుక వట్టి బీరమేఁటికే

(॥చెలు॥)
చేరఁడేసి కన్నుల చెలియవు మొదలనె
వూర కాతనిఁ జూడ కెట్టుండఁగలవే
మూరెఁడు దురుముతోడ మురిసేటిదానవు
యీరీతిఁ జెలిమాఁటున నెట్టు దాఁగేవే

(॥చెలు॥)
పట్టెఁడేసి గుబ్బల పంతగత్తె విటమీఁద
గుట్టుతోడ నెటువలె గుబ్బతిలేవే
వొట్టిన జవ్వనమున నువ్విళ్లూరేదానవు
దట్టపు టాసల నెట్టు తప్పఁదోసేవే

(॥చెలు॥)
సెలవి నవ్వులతోడఁ జిప్పిలేటిదానవు
వులివచ్చి సిగ్గుల నెట్టోలలాడేవే
యెలమి శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్నుఁగూడె
తలపోఁగరతి నెట్టు తనియకుండేవే

(||pallavi||)
sĕlula muṁdara niṁta sesevugāga
valabu loḍim̐ gaṭṭuga vaṭṭi bīramem̐ṭige

(||sĕlu||)
seram̐ḍesi kannula sĕliyavu mŏdalanĕ
vūra kādanim̐ jūḍa kĕṭṭuṁḍam̐galave
mūrĕm̐ḍu durumudoḍa muriseḍidānavu
yīrīdim̐ jĕlimām̐ṭuna nĕṭṭu dām̐geve

(||sĕlu||)
paṭṭĕm̐ḍesi gubbala paṁtagattĕ viḍamīm̐da
guṭṭudoḍa nĕḍuvalĕ gubbadileve
vŏṭṭina javvanamuna nuvviḽlūredānavu
daṭṭabu ṭāsala nĕṭṭu tappam̐doseve

(||sĕlu||)
sĕlavi navvuladoḍam̐ jippileḍidānavu
vulivachchi siggula nĕṭṭolalāḍeve
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnum̐gūḍĕ
talabom̐garadi nĕṭṭu taniyaguṁḍeve