చెలుల మింతే నేము సిగ్గు మీ కేల
(॥పల్లవి॥)
చెలుల మింతే నేము సిగ్గు మీ కేల
వెలనే మీ సంగాతాలు వేడుకాయ మాకు
(॥॥)
మచ్చిక మాటలు నీతో మగువ నేఁ డాడఁగాను
విచ్చన విడి వీనుల వింటిమి నేము
రచ్చఁబడి వలపులు రాఁపాయ మీ తలఁపులు
పచ్చిసేసి ఇఁక నవ్వఁ బాడిగాదు మాకు
(॥॥)
చనవుతో నాకె నీసంగడిఁ గూచుండఁ గా
కనుఁగవ పండుగగాఁ గంటిమి నేము
పెనగొని వేడుకలు బెరసె మీ వాడికలు
పనులివి మిమ్మడుగఁ బాడిగాదు మాకు
(॥॥)
నాతిని పానుపు మీఁద ననిచి కౌఁగిలించఁగా
చేతులార నీ సేవ సేసితిమి నేము
యీతల శ్రీ వేంటేశ యిద్దరి మేనులు దాసె
పైతరవై మిమ్మొరయఁ బాడిగాదు మాకూ
(||pallavi||)
sĕlula miṁte nemu siggu mī kela
vĕlane mī saṁgādālu veḍugāya māgu
(||||)
machchiga māḍalu nīdo maguva nem̐ ḍāḍam̐gānu
vichchana viḍi vīnula viṁṭimi nemu
rachcham̐baḍi valabulu rām̐pāya mī talam̐pulu
pachchisesi im̐ka navvam̐ bāḍigādu māgu
(||||)
sanavudo nāgĕ nīsaṁgaḍim̐ gūsuṁḍam̐ gā
kanum̐gava paṁḍugagām̐ gaṁṭimi nemu
pĕnagŏni veḍugalu bĕrasĕ mī vāḍigalu
panulivi mimmaḍugam̐ bāḍigādu māgu
(||||)
nādini pānubu mīm̐da nanisi kaum̐giliṁcham̐gā
sedulāra nī seva sesidimi nemu
yīdala śhrī veṁṭeśha yiddari menulu dāsĕ
paidaravai mimmŏrayam̐ bāḍigādu māgū