Selula middarigini sevalu sesevaaramu

చెలుల మిద్దరికిని సేవలు సేసేవారము
Language

(॥పల్లవి॥)
చెలుల మిద్దరికిని సేవలు సేసేవారము
యెలమి నీ తలఁపానతియ్యవయ్య యిఁకను

(॥చెలు॥)
సోయగపుఁ జూపు చూచి సొంపులు నీకురేఁచి
పాయకున్నది నీవద్ద బడతి నేడు
మోయరాని మోపులాయ మోహములన్నియుఁగూడె
చేయఁగలపనులిఁకఁ జెప్పవయ్య మాకును

(॥చెలు॥)
తమకపుమాట లాడి తనువుపై జేఇ వేసి
ప్రమదమె చల్లీ నీపై భామిని నేఁడు
గుమురులై పులకించె గుట్టున మతి గరఁగె
సముకాన నియ్యవయ్యా చనవులు మాకును

(॥చెలు॥)
సెలవుల నవ్వు నవ్వి సిగ్గులు పలచఁజేసి
మెలఁగుచుఁ గూడె నలమేలుమంగ
చెలరేఁగె వేడుకలు శ్రీవేంకటేశ్వర
కలకామును మేలే కదవయ్యా మాకును

(||pallavi||)
sĕlula middarigini sevalu sesevāramu
yĕlami nī talam̐pānadiyyavayya yim̐kanu

(||sĕlu||)
soyagabum̐ jūbu sūsi sŏṁpulu nīgurem̐si
pāyagunnadi nīvadda baḍadi neḍu
moyarāni mobulāya mohamulanniyum̐gūḍĕ
seyam̐galabanulim̐kam̐ jĕppavayya māgunu

(||sĕlu||)
tamagabumāḍa lāḍi tanuvubai jei vesi
pramadamĕ sallī nībai bhāmini nem̐ḍu
gumurulai pulagiṁchĕ guṭṭuna madi garam̐gĕ
samugāna niyyavayyā sanavulu māgunu

(||sĕlu||)
sĕlavula navvu navvi siggulu palasam̐jesi
mĕlam̐gusum̐ gūḍĕ nalamelumaṁga
sĕlarem̐gĕ veḍugalu śhrīveṁkaḍeśhvara
kalagāmunu mele kadavayyā māgunu