Selula meṟamgamu sepparayaa

చెలుల మెఱంగము చెప్పరయా
Language

(॥పల్లవి॥)
చెలుల మెఱంగము చెప్పరయా
నెలకొని తమకము నిండెనొ మీకు

(॥చెలుల॥)
సెలవుల నగవులు చిమ్మిరేఁగెనవె
తలఁపులెపుడు సరిదాఁకునొకో
చెలవల చెమటలు చెక్కుల వడిసీ
కలగొని వలపులు కరఁగెనొ మీకు

(॥చెలుల॥)
సంపదపులకలు జడిసీ మేనుల
యింపుల లోలో నెసగెనొకో
ముంపుల వూర్పులు ముక్కుల విసరీ
పెంపుల మేనులు పెరిగెనో మీకు

(॥చెలుల॥)
నిరతపుఁ గళలవె నిగిడీ మొగముల
గరిమఁ గూటములు గలసె నొకో
యిరవుగ శ్రీవేంకటేశ యలసితిరి
సురతముల మతులు చొక్కెనొ మీకు

(||pallavi||)
sĕlula mĕṟaṁgamu sĕpparayā
nĕlagŏni tamagamu niṁḍĕnŏ mīgu

(||sĕlula||)
sĕlavula nagavulu simmirem̐gĕnavĕ
talam̐pulĕbuḍu saridām̐kunŏgo
sĕlavala sĕmaḍalu sĕkkula vaḍisī
kalagŏni valabulu karam̐gĕnŏ mīgu

(||sĕlula||)
saṁpadabulagalu jaḍisī menula
yiṁpula lolo nĕsagĕnŏgo
muṁpula vūrbulu mukkula visarī
pĕṁpula menulu pĕrigĕno mīgu

(||sĕlula||)
niradabum̐ gaḽalavĕ nigiḍī mŏgamula
garimam̐ gūḍamulu galasĕ nŏgo
yiravuga śhrīveṁkaḍeśha yalasidiri
suradamula madulu sŏkkĕnŏ mīgu