చెలుల కెల్లా నీవు సేసిన వుపకారము
(॥పల్లవి॥)
చెలుల కెల్లా నీవు సేసిన వుపకారము
మలసి యాపె కౌఁగిలి మఱవకుమీ
(॥॥)
వేడుక నీ కతలెల్లా వీనులపండుగ గాను
ఆడుకోఁగా వింటిమి నే మందరిచేత
జోడుగా నొక్క తెను మెచ్చుగఁ దెచ్చుకొంటివట
పాడి దప్పక నీ వాకెఁ బాలించుమీ
(॥॥)
కమ్మటి నీ చేఁతలు కన్నుల పండుగ గాను
పమ్మి కనుఁ గొంటిమి నీ పానుపు మీఁద
కొమ్మ యొకతె వున్నది కొత్త పెండ్లికూఁతురట
నమ్మి కిచ్చినట్లే మన్నన నేలుమీ
(॥॥)
నెలకొన్న నీ రతులు నిచ్చ పండుగలు గాను
తలఁచి మెచ్చితిమి నీ తనువు సోఁకి
అలమేల్మంగ నొక్కతె నక్కునఁ గట్టు కొంటివి
ఇల శ్రీ వేంకటేశ్వర యీడేర్చుమీ
(||pallavi||)
sĕlula kĕllā nīvu sesina vubagāramu
malasi yābĕ kaum̐gili maṟavagumī
(||||)
veḍuga nī kadalĕllā vīnulabaṁḍuga gānu
āḍugom̐gā viṁṭimi ne maṁdariseda
joḍugā nŏkka tĕnu mĕchchugam̐ dĕchchugŏṁṭivaḍa
pāḍi dappaga nī vāgĕm̐ bāliṁchumī
(||||)
kammaḍi nī sem̐talu kannula paṁḍuga gānu
pammi kanum̐ gŏṁṭimi nī pānubu mīm̐da
kŏmma yŏgadĕ vunnadi kŏtta pĕṁḍligūm̐turaḍa
nammi kichchinaṭle mannana nelumī
(||||)
nĕlagŏnna nī radulu nichcha paṁḍugalu gānu
talam̐si mĕchchidimi nī tanuvu som̐ki
alamelmaṁga nŏkkadĕ nakkunam̐ gaṭṭu kŏṁṭivi
ila śhrī veṁkaḍeśhvara yīḍersumī