Selula bhaagya maadani sittamugaa

చెలుల భాగ్య మాతని చిత్తముగా
Language

(॥పల్లవి॥)
చెలుల భాగ్య మాతని చిత్తముగా
తలకొని యాఁకారఁ దమకేఁటికి

(॥చెలు॥)
పెక్కుసతులమగఁడు ప్రేమ వొకతెపైనుంటే
తక్కినకాంత అడుగఁ దమకేఁటికి
చిక్కనిచెమటమేనఁ జిప్పిలఁగ దొరకంటే
తక్కరితనాల నవ్వఁ దమకేఁటికి

(॥చెలు॥)
మనసుపెట్టినవాఁడు మాటొకతెతో నాడితే
తనువులఁ గాఁకరేఁగఁ దమకేఁటికి
కనుఁగొని యాతనికాంక్షలు దీరకుంటే
తనియఁడంటా దూరఁ దమకేఁటికి

(॥చెలు॥)
కడువేడుక్కెనవాఁడు కాఁగి లొకతె కిచ్చితే
తడఁబడి పైకొనఁ దమకేఁటికి
పడఁతెలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడు
తడయ కేలితే సిగ్గు దమకేఁటికి

(||pallavi||)
sĕlula bhāgya mādani sittamugā
talagŏni yām̐kāram̐ damagem̐ṭigi

(||sĕlu||)
pĕkkusadulamagam̐ḍu prema vŏgadĕbainuṁṭe
takkinagāṁta aḍugam̐ damagem̐ṭigi
sikkanisĕmaḍamenam̐ jippilam̐ga dŏragaṁṭe
takkaridanāla navvam̐ damagem̐ṭigi

(||sĕlu||)
manasubĕṭṭinavām̐ḍu māḍŏgadĕdo nāḍide
tanuvulam̐ gām̐karem̐gam̐ damagem̐ṭigi
kanum̐gŏni yādanigāṁkṣhalu dīraguṁṭe
taniyam̐ḍaṁṭā dūram̐ damagem̐ṭigi

(||sĕlu||)
kaḍuveḍukkĕnavām̐ḍu kām̐gi lŏgadĕ kichchide
taḍam̐baḍi paigŏnam̐ damagem̐ṭigi
paḍam̐tĕlamelumaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
taḍaya kelide siggu damagem̐ṭigi