Selu limte meeremi sedure nemdu

చెలు లింతే మీరేమి సేతురే నేఁడు
Language

(॥పల్లవి॥)
చెలు లింతే మీరేమి సేతురే నేఁడు
అలరి ఆతని పంత మమరుఁ గాక

(॥చెలు॥)
తలఁపు నే నెఱఁగనా తరుణులఁగంటేను
చెలిమి దాఁ జేసును సేయఁడునని
మలసిన మగవాని మా కనఁగవచ్చునా
చెలువుఁడు సేసినట్టే చెల్లుఁగాక

(॥చెలు॥)
తనగుణ మెఱఁగనా తతి మానినులతోడ
పెనఁగును పెనఁగఁడు ప్రియాననని
ఘనుఁడైనవాని మాకు గద్దించవసమా
తనివిగలిగినంతా దక్కు గాక

(॥చెలు॥)
కరుణ నే నెఱఁగనా కడఁగి మావంటివారి
కరఁగించు కరఁగ దాఁగలఁడని
యిరవై శ్రీ వేంకటేశుఁ డిప్పుడిట్టె నన్నుఁ గూడె
అరుదైన నెరతన మమరుఁ గాక

(||pallavi||)
sĕlu liṁte mīremi sedure nem̐ḍu
alari ādani paṁta mamarum̐ gāga

(||sĕlu||)
talam̐pu ne nĕṟam̐ganā taruṇulam̐gaṁṭenu
sĕlimi dām̐ jesunu seyam̐ḍunani
malasina magavāni mā kanam̐gavachchunā
sĕluvum̐ḍu sesinaṭṭe sĕllum̐gāga

(||sĕlu||)
tanaguṇa mĕṟam̐ganā tadi māninuladoḍa
pĕnam̐gunu pĕnam̐gam̐ḍu priyānanani
ghanum̐ḍainavāni māgu gaddiṁchavasamā
tanivigaliginaṁtā dakku gāga

(||sĕlu||)
karuṇa ne nĕṟam̐ganā kaḍam̐gi māvaṁṭivāri
karam̐giṁchu karam̐ga dām̐galam̐ḍani
yiravai śhrī veṁkaḍeśhum̐ ḍippuḍiṭṭĕ nannum̐ gūḍĕ
arudaina nĕradana mamarum̐ gāga