చెలు లిఁక నాయము చెప్పకురే మీరు
(॥పల్లవి॥)
చెలు లిఁక నాయము చెప్పకురే మీరు
చలములు నడుమనె సాదించేటివి
(॥చెలు॥)
నేరము లెంచిన నెపములు వేసిన
వూరక లోలో నొల్లనిది
కూరిమి గొసరిన గుట్టున నుండిన
సారె వలపు లవి చప్పనివి
(॥చెలు॥)
పంతము లాడిన పరాకు సేసిన
సంతతమగుతమి చాలనిది
వంతులు వట్టిన వళుకు లాడినను
అంత చుట్టరిక మాపాటిది
(॥చెలు॥)
వొక్కట నవ్విన వొడఁబరపించిన
యిక్కువ కాఁగిలి యెరవులది
గక్కన శ్రీవేంకటపతి గలసెను
తక్కులు తొలుతే దాఁటినవి
(||pallavi||)
sĕlu lim̐ka nāyamu sĕppagure mīru
salamulu naḍumanĕ sādiṁcheḍivi
(||sĕlu||)
neramu lĕṁchina nĕbamulu vesina
vūraga lolo nŏllanidi
kūrimi gŏsarina guṭṭuna nuṁḍina
sārĕ valabu lavi sappanivi
(||sĕlu||)
paṁtamu lāḍina parāgu sesina
saṁtadamagudami sālanidi
vaṁtulu vaṭṭina vaḽugu lāḍinanu
aṁta suṭṭariga mābāḍidi
(||sĕlu||)
vŏkkaḍa navvina vŏḍam̐barabiṁchina
yikkuva kām̐gili yĕravuladi
gakkana śhrīveṁkaḍabadi galasĕnu
takkulu tŏlude dām̐ṭinavi