Sellunayyaa yee maada shreehari

చెల్లునయ్యా యీ మాట శ్రీహరి
Language

(॥పల్లవి॥)
చెల్లునయ్యా యీ మాట శ్రీహరి
యెల్లవారికి నిది విన నింపౌఁ గాదో

(॥చెల్లు॥)
చేచేత నిన్ను ధ్యానము సేయు కంటెఁ బెద్ద లెల్లా
యేచి నీ గుణానుభవమే యెక్కుడందురు
పూచిన శాఖలతోడఁ బొదలు వృక్షము కంటెను
కాచి పండిన ఫలము ఘనమౌఁ గాదో

(॥చెల్లు॥)
యిన్నిటాను నీకంటేను యెంచి చూచి పెద్ద లెల్లా
చెన్నుగాని దాసులె విశేష మందురు
మిన్నక వనములలో మెఱయుఁ గోవిలకంటెను
వున్నతంబైన నాదమొప్పిదమౌఁ గాదో

(॥చెల్లు॥)
మనసారని నాముతోడి మంత్రముకంటెఁ బెద్దలెల్లా
మునుప నాచార్యుఁడే ముఖ్యమందురు
వొనరి శ్రీవేంకటేశ వుర్వి నిక్షేపముకంటె
కనిపంచే యంజనమే వెగ్గలమౌఁ గాదో

(||pallavi||)
sĕllunayyā yī māḍa śhrīhari
yĕllavārigi nidi vina niṁpaum̐ gādo

(||sĕllu||)
seseda ninnu dhyānamu seyu kaṁṭĕm̐ bĕdda lĕllā
yesi nī guṇānubhavame yĕkkuḍaṁduru
pūsina śhākhaladoḍam̐ bŏdalu vṛkṣhamu kaṁṭĕnu
kāsi paṁḍina phalamu ghanamaum̐ gādo

(||sĕllu||)
yinniḍānu nīgaṁṭenu yĕṁchi sūsi pĕdda lĕllā
sĕnnugāni dāsulĕ viśheṣha maṁduru
minnaga vanamulalo mĕṟayum̐ govilagaṁṭĕnu
vunnadaṁbaina nādamŏppidamaum̐ gādo

(||sĕllu||)
manasārani nāmudoḍi maṁtramugaṁṭĕm̐ bĕddalĕllā
munuba nāsāryum̐ḍe mukhyamaṁduru
vŏnari śhrīveṁkaḍeśha vurvi nikṣhebamugaṁṭĕ
kanibaṁche yaṁjaname vĕggalamaum̐ gādo