చెల్లునయ్య నీవు సేసే చేఁత లన్నియు
(॥పల్లవి॥)
చెల్లునయ్య నీవు సేసే చేఁత లన్నియు
కల్లగాదు మొక్కే నీకు కాంక్ష రేఁగఁగాను
(॥చెల్లు॥)
యొగసక్కేలాడక నీవేమిసేతువయ్యమమ్ముఁ
జిగురుఁగైదువయింత సేయగాను
నగరెక్కుకొని నీవు నవ్వు నవ్వవలదా
పగటుమాజవ్వనముపసురు లెక్కించఁగా
(॥చెల్లు॥)
మానముపైఁదిట్టక మరి యెన్నఁడయ్యా నీవు
పూనిననావలపు లుప్పొంగఁగాను
దానికేమి నీవు నాతోఁ దతిగొనవలదా
మోనాన నాచూపు నీపై ముడిగొనఁగా
(॥చెల్లు॥)
ఇట్టె నన్నుఁ గాఁగిలించకేల వూరకుండేవయ్యా
జట్టినాకోర్కులు కొనసాగఁగాను
గుట్టునశ్రీవేంకటేశ కూడితివి మండెములో
బెట్టగురతులు నాలోఁ బెనగొనఁగా
(||pallavi||)
sĕllunayya nīvu sese sem̐ta lanniyu
kallagādu mŏkke nīgu kāṁkṣha rem̐gam̐gānu
(||sĕllu||)
yŏgasakkelāḍaga nīvemiseduvayyamammum̐
jigurum̐gaiduvayiṁta seyagānu
nagarĕkkugŏni nīvu navvu navvavaladā
pagaḍumājavvanamubasuru lĕkkiṁcham̐gā
(||sĕllu||)
mānamubaim̐diṭṭaga mari yĕnnam̐ḍayyā nīvu
pūninanāvalabu luppŏṁgam̐gānu
dānigemi nīvu nādom̐ dadigŏnavaladā
monāna nāsūbu nībai muḍigŏnam̐gā
(||sĕllu||)
iṭṭĕ nannum̐ gām̐giliṁchagela vūraguṁḍevayyā
jaṭṭināgorgulu kŏnasāgam̐gānu
guṭṭunaśhrīveṁkaḍeśha kūḍidivi maṁḍĕmulo
bĕṭṭaguradulu nālom̐ bĕnagŏnam̐gā