Sellunamma neevemi sesinaanu nee vibhumdu

చెల్లునమ్మ నీవేమి సేసినాను నీ విభుఁడు
Language

(॥పల్లవి॥)
చెల్లునమ్మ నీవేమి సేసినాను నీ విభుఁడు
యెల్లనాఁడు నిన్నుఁ బాయ కేలేవాఁడు గనక

(॥చెల్లు॥)
సంకెలేక పూవులు సారెఁ గోసే వదియేమే
అంకెల నవి మరుని కమ్ములు గావా
కొంకక చిగురాకులు కోవిలకు మేపేవేమే
కొంకులేనియడిదాలకొనలు గావా

(॥చెల్లు॥)
నిందుగాఁ జకోరాలకు వెన్నెల దాగించేవేమే
చందురుని కిదణాల సంపదగాదా
మందలించి పన్నీరు చిమ్మనఁగోవి జిమ్మేవేమే
పొంది యది మంచుననే పుట్టినది గాదా

(॥చెల్లు॥)
చెట్టులమందులు దెచ్చి చిలుకల కిచ్చేవేమే
పట్టిన వసంతుని పంటలు గావా
గుట్టున శ్రీవేంకటేశుఁ గూడి యలమేల్మంగవు
అట్టె చోఁపేవేమే యలు లందలివే కావా

(||pallavi||)
sĕllunamma nīvemi sesinānu nī vibhum̐ḍu
yĕllanām̐ḍu ninnum̐ bāya kelevām̐ḍu ganaga

(||sĕllu||)
saṁkĕlega pūvulu sārĕm̐ gose vadiyeme
aṁkĕla navi maruni kammulu gāvā
kŏṁkaga sigurāgulu kovilagu mebeveme
kŏṁkuleniyaḍidālagŏnalu gāvā

(||sĕllu||)
niṁdugām̐ jagorālagu vĕnnĕla dāgiṁcheveme
saṁduruni kidaṇāla saṁpadagādā
maṁdaliṁchi pannīru simmanam̐govi jimmeveme
pŏṁdi yadi maṁchunane puṭṭinadi gādā

(||sĕllu||)
sĕṭṭulamaṁdulu dĕchchi silugala kichcheveme
paṭṭina vasaṁtuni paṁṭalu gāvā
guṭṭuna śhrīveṁkaḍeśhum̐ gūḍi yalamelmaṁgavu
aṭṭĕ som̐peveme yalu laṁdalive kāvā