Sellunaa nee keebanulu sennageshaa

చెల్లునా నీ కీపనులు చెన్నకేశా
Language

(॥పల్లవి॥)
చెల్లునా నీ కీపనులు చెన్నకేశా
కొల్లకాఁడ వౌర గండిగోట చెన్నకేశా

(॥చెల్లు॥)
అంగవించి మగనాలి కాసపడే విందరిలోఁ
జెంగలింపుఁ జూపులతోఁ జెన్నకేశ
రంగుమీర నిరువంక రమణు లిద్దరుండుఁగా
అంగన లింకానా ఔరా చెన్నకేశా

(॥చెల్లు॥)
కమ్మటి మానవు మమ్ముఁ గరఁగించే వూరకైనా
చిమ్ముఁదేనె మాటలతోఁ జెన్నకేశ
దొమ్మిసేసి మగువల తొల్లె యాఱడిఁ బెట్టితి-
వమ్మరో నీకు వెరతుమౌర చెన్నకేశా

(॥చెల్లు॥)
వావి గద్దంటా నాతో వచ్చి వచ్చి నవ్వేవు
శ్రీవేంకటాద్రి మీఁదఁ జెన్న కేశ
కావిమోవి గంటిసేసి కమ్మి నన్నుఁగూడితివి
ఆవేశ నేమననైతి(నే మనసైతి)చెన్న కేశా

(||pallavi||)
sĕllunā nī kībanulu sĕnnageśhā
kŏllagām̐ḍa vaura gaṁḍigoḍa sĕnnageśhā

(||sĕllu||)
aṁgaviṁchi maganāli kāsabaḍe viṁdarilom̐
jĕṁgaliṁpum̐ jūbuladom̐ jĕnnageśha
raṁgumīra niruvaṁka ramaṇu liddaruṁḍum̐gā
aṁgana liṁkānā aurā sĕnnageśhā

(||sĕllu||)
kammaḍi mānavu mammum̐ garam̐giṁche vūragainā
simmum̐denĕ māḍaladom̐ jĕnnageśha
dŏmmisesi maguvala tŏllĕ yāṟaḍim̐ bĕṭṭidi-
vammaro nīgu vĕradumaura sĕnnageśhā

(||sĕllu||)
vāvi gaddaṁṭā nādo vachchi vachchi navvevu
śhrīveṁkaḍādri mīm̐dam̐ jĕnna keśha
kāvimovi gaṁṭisesi kammi nannum̐gūḍidivi
āveśha nemananaidi(ne manasaidi)sĕnna keśhā