చెల్లుఁగదె యాతఁడేమి సేసినా నీయెడకును
(॥పల్లవి॥)
చెల్లుఁగదె యాతఁడేమి సేసినా నీయెడకును
పల్లదాన నింతేసి పఱచకువే
(॥॥)
వొగ్గి యాతఁడిట్టె నీవొడివట్టెనంటాను
సిగ్గులువడకువే చెలియా
తగ్గక అట్టె బలిమిఁ దమ్ములమిడెనంటాను
దిగ్గనఁ దొదలుమాఁటఁ దిట్టకువే నీవు
(॥॥)
సారె కొనగోళ్ళను నీచన్నులు దాఁకించెనంటా
బీరాన జంకించకువే ప్రియురాలా
కోరి నవ్వుతా నీకొప్పు వట్టి తీసెనంటా
మేర మీరకువే మందెమేళమునను
(॥॥)
కప్పి శ్రీ వేంకటేశుఁడు కాఁగిలించి కూడెనంటా
తప్పులువట్టకువే తరుణి
చిప్పిలు నీమోవితేనె చేకొని నీ కిచ్చెనంటా
వుప్పటించకువే యింత వుదుటునను
(||pallavi||)
sĕllum̐gadĕ yādam̐ḍemi sesinā nīyĕḍagunu
palladāna niṁtesi paṟasaguve
(||||)
vŏggi yādam̐ḍiṭṭĕ nīvŏḍivaṭṭĕnaṁṭānu
sigguluvaḍaguve sĕliyā
taggaga aṭṭĕ balimim̐ dammulamiḍĕnaṁṭānu
digganam̐ dŏdalumām̐ṭam̐ diṭṭaguve nīvu
(||||)
sārĕ kŏnagoḽḽanu nīsannulu dām̐kiṁchĕnaṁṭā
bīrāna jaṁkiṁchaguve priyurālā
kori navvudā nīgŏppu vaṭṭi tīsĕnaṁṭā
mera mīraguve maṁdĕmeḽamunanu
(||||)
kappi śhrī veṁkaḍeśhum̐ḍu kām̐giliṁchi kūḍĕnaṁṭā
tappuluvaṭṭaguve taruṇi
sippilu nīmovidenĕ segŏni nī kichchĕnaṁṭā
vuppaḍiṁchaguve yiṁta vuduḍunanu