చెల్లుఁ జెల్లునోయి నీవు సేసినంతాను
(॥పల్లవి॥)
చెల్లుఁ జెల్లునోయి నీవు సేసినంతాను
కొల్లున నవ్వేవు నీకొంగుపట్టఁగాను
(॥చెల్లు॥)
పంతగాఁడవావోయి పలుమారుఁ బెనఁగేవు
చెంతనుండి నీసేవసేయఁగాను
వింతవాఁడవోయివెరగంది చూచేవు
మంతనాన నేఁడునీమర్మము లంటఁగాను
(॥చెల్లు॥)
అందగాఁడవా వోయి అడినట్టె ఆడేవు
అంది నే సుద్దులు నిన్ను నడుగఁగాను
మందడీఁడవా వోయి మంకులెల్లా నెరపేవు
విందు చెప్పి చెక్కునొక్కి వేఁడుకొనఁగాను
(॥చెల్లు॥)
నాతికాఁడవా వోఇ నంటునఁ దలవంచేవు
కోలుముందై కాఁగిలో కొసరఁగాను
యీలీల శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి
బాలుఁడవా మోవిచ్చితే పచ్చిగాఁ జేయఁగాను
(||pallavi||)
sĕllum̐ jĕllunoyi nīvu sesinaṁtānu
kŏlluna navvevu nīgŏṁgubaṭṭam̐gānu
(||sĕllu||)
paṁtagām̐ḍavāvoyi palumārum̐ bĕnam̐gevu
sĕṁtanuṁḍi nīsevaseyam̐gānu
viṁtavām̐ḍavoyivĕragaṁdi sūsevu
maṁtanāna nem̐ḍunīmarmamu laṁṭam̐gānu
(||sĕllu||)
aṁdagām̐ḍavā voyi aḍinaṭṭĕ āḍevu
aṁdi ne suddulu ninnu naḍugam̐gānu
maṁdaḍīm̐ḍavā voyi maṁkulĕllā nĕrabevu
viṁdu sĕppi sĕkkunŏkki vem̐ḍugŏnam̐gānu
(||sĕllu||)
nādigām̐ḍavā voi naṁṭunam̐ dalavaṁchevu
kolumuṁdai kām̐gilo kŏsaram̐gānu
yīlīla śhrīveṁkaḍeśha iḍu nannu nelidivi
bālum̐ḍavā movichchide pachchigām̐ jeyam̐gānu