చెల్లుఁ జెల్లు నీచేఁత చెన్నకేశవా
(॥పల్లవి॥)
చెల్లుఁ జెల్లు నీచేఁత చెన్నకేశవా
చిల్లరసుద్దు లింకేల చెన్నకేశవా
(॥చెల్లు॥)
రమ్మనుచుఁ బిలిచేవు రాజసాన వీఁగేవు
చిమ్ముఁజెమటలఁ జెక్కులచెన్న కేశవా
కమ్మరఁ గమ్మర నీవు కన్నులనే సొలయఁగ
చిమ్మిరేఁగె మేనెల్లా చెన్న కేశవా
(॥చెల్లు॥)
మొగము చూచి నీవు మొక్కవచ్చి లోఁగేవు
చిగురుఁ బెదవి వాడె చెన్నకేశవా
అగపడి నీవు నాపై నానలెల్లాఁ బెట్టఁగాను
జిగిమించె నివ్వెరగు చెన్నకేశవా
(॥చెల్లు॥)
దగ్గరితివిదె నన్ను తప్పక చూచితేను
సిగ్గుదేరె నీమోమున చెన్న కేశవా
వొగ్గుచు శ్రీవేంకటాద్రినుండి వచ్చి మాఁడుకూర
సెగ్గెముదేరఁ గూడితి చెన్న కేశవా
(||pallavi||)
sĕllum̐ jĕllu nīsem̐ta sĕnnageśhavā
sillarasuddu liṁkela sĕnnageśhavā
(||sĕllu||)
rammanusum̐ bilisevu rājasāna vīm̐gevu
simmum̐jĕmaḍalam̐ jĕkkulasĕnna keśhavā
kammaram̐ gammara nīvu kannulane sŏlayam̐ga
simmirem̐gĕ menĕllā sĕnna keśhavā
(||sĕllu||)
mŏgamu sūsi nīvu mŏkkavachchi lom̐gevu
sigurum̐ bĕdavi vāḍĕ sĕnnageśhavā
agabaḍi nīvu nābai nānalĕllām̐ bĕṭṭam̐gānu
jigimiṁchĕ nivvĕragu sĕnnageśhavā
(||sĕllu||)
daggaridividĕ nannu tappaga sūsidenu
sigguderĕ nīmomuna sĕnna keśhavā
vŏggusu śhrīveṁkaḍādrinuṁḍi vachchi mām̐ḍugūra
sĕggĕmuderam̐ gūḍidi sĕnna keśhavā