చెల్లుఁ జెల్లు నీకు నాకు సిగ్గు మరఁగు
(॥పల్లవి॥)
చెల్లుఁ జెల్లు నీకు నాకు సిగ్గు మరఁగు
యెల్లభావము గంటి మిఁక నేల మరఁగు
(॥చెల్లు॥)
మోవిమీఁది కెంపులకు మోనమె మరఁగు
కావికన్నులకు నిద్ర కడు మరఁగు
తేవల నిట్టూర్పులకు తీగెనవ్వె మరఁగు
యీవిధాలు గంటి నాతో నిఁక నేల మరఁగు
(॥చెల్లు॥)
చెక్కులచెమటలకు చెంపచేయి మరఁగు
మిక్కిలి వులకలకు మెయిపూఁత మరఁగు
తక్కి మోము వాఁడుటకు తమ్ములము మరఁగు
యిక్కడ నిన్నిఁ గంటి నిఁక నేల మరఁగు
(॥చెల్లు॥)
కూడినకూటమునకు గుట్టు యిదె మరఁగు
జాడల నీ మేనికి నా చన్నుదోయి మరఁగు
వేడుకకు శ్రీ వెంకటేశ వేసాలు నీ మరఁగు
యీడ నిన్నిఁ బచ్చిదేరె నిఁక నేల మరఁగు
(||pallavi||)
sĕllum̐ jĕllu nīgu nāgu siggu maram̐gu
yĕllabhāvamu gaṁṭi mim̐ka nela maram̐gu
(||sĕllu||)
movimīm̐di kĕṁpulagu monamĕ maram̐gu
kāvigannulagu nidra kaḍu maram̐gu
tevala niṭṭūrbulagu tīgĕnavvĕ maram̐gu
yīvidhālu gaṁṭi nādo nim̐ka nela maram̐gu
(||sĕllu||)
sĕkkulasĕmaḍalagu sĕṁpaseyi maram̐gu
mikkili vulagalagu mĕyibūm̐ta maram̐gu
takki momu vām̐ḍuḍagu tammulamu maram̐gu
yikkaḍa ninnim̐ gaṁṭi nim̐ka nela maram̐gu
(||sĕllu||)
kūḍinagūḍamunagu guṭṭu yidĕ maram̐gu
jāḍala nī menigi nā sannudoyi maram̐gu
veḍugagu śhrī vĕṁkaḍeśha vesālu nī maram̐gu
yīḍa ninnim̐ bachchiderĕ nim̐ka nela maram̐gu