చెల్లుబడియైన మీఁద చేఁతలు మరేమిటికి
(॥పల్లవి॥)
చెల్లుబడియైన మీఁద చేఁతలు మరేమిటికి
చల్లఁగా నా మోవి యాని చవులెంచుఁగాక
(॥చెల్లు॥)
మొగము చూచినవాఁడు ముచ్చటకు రమ్మనవే
నగినవాఁ డిమ్మనవే నాకుఁ జనవు
తగులనాడినవాఁడు దగ్గరఁగ రమ్మనవే
మగిడి నన్నిఁక నెంత మరసు సోదించీని
(॥చెల్లు॥)
చెలిమి సేసినవాఁడు చేతికి లోఁగమ్మనవే
కలయ వచ్చినవాఁడు కైకొమ్మనవే
వలపించినవాఁడు కైవసము గమ్మనవే
లలి నెందాఁకాను నాలాగులు చూచీని
(॥చెల్లు॥)
సరసమాడినవాఁడు సతమై యేలుమనవే
తెరవేసినవాఁడు సందించు మనవే
ఇరవై శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ బెండ్లాడె
సురతవేళల నేమి చొప్పులు వెదకీని
(||pallavi||)
sĕllubaḍiyaina mīm̐da sem̐talu maremiḍigi
sallam̐gā nā movi yāni savulĕṁchum̐gāga
(||sĕllu||)
mŏgamu sūsinavām̐ḍu muchchaḍagu rammanave
naginavām̐ ḍimmanave nāgum̐ janavu
tagulanāḍinavām̐ḍu daggaram̐ga rammanave
magiḍi nannim̐ka nĕṁta marasu sodiṁchīni
(||sĕllu||)
sĕlimi sesinavām̐ḍu sedigi lom̐gammanave
kalaya vachchinavām̐ḍu kaigŏmmanave
valabiṁchinavām̐ḍu kaivasamu gammanave
lali nĕṁdām̐kānu nālāgulu sūsīni
(||sĕllu||)
sarasamāḍinavām̐ḍu sadamai yelumanave
tĕravesinavām̐ḍu saṁdiṁchu manave
iravai śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ bĕṁḍlāḍĕ
suradaveḽala nemi sŏppulu vĕdagīni