చెల్లుబడిగలవేళ సిగ్గువడవే నీవు
(॥పల్లవి॥)
చెల్లుబడిగలవేళ సిగ్గువడవే నీవు
యెల్లవారిలో నీకు యెన్నికలు గావా
(॥చెల్లు॥)
తగవరిమాఁటలు తతిఁ జూపులతేటలు
నిడిడి నీవే లెస్స నేరిచితివే
జగడాలడిచేవేమే సవతులతోనెల్ల
మొగుఁడు చూడఁగ నీకు మురిపెముగాదా
(॥చెల్లు॥)
సారెఁ జాఁచేచేతులు జంకెనలరీతులు
నీరపమాయఁ గనక నేరిచితివే
బీరము లాడేవేమే పెద్దపెద్దయెలుఁగుల
యీరీతిఁ బతిముందర యెమ్మెలు గావా
(॥చెల్లు॥)
బచ్చెననీరవ్వలు పకపకనీనవ్వులు
నిచ్చలు నిచ్చలు నీవే నేరిచితివే
యిచ్చట శ్రీవేంకటేశు నెనసితి విఁకనేమే
గచ్చు లాతనివొద్ద ఘనతలు గావా
(||pallavi||)
sĕllubaḍigalaveḽa sigguvaḍave nīvu
yĕllavārilo nīgu yĕnnigalu gāvā
(||sĕllu||)
tagavarimām̐ṭalu tadim̐ jūbuladeḍalu
niḍiḍi nīve lĕssa nerisidive
jagaḍālaḍiseveme savaduladonĕlla
mŏgum̐ḍu sūḍam̐ga nīgu muribĕmugādā
(||sĕllu||)
sārĕm̐ jām̐sesedulu jaṁkĕnalarīdulu
nīrabamāyam̐ ganaga nerisidive
bīramu lāḍeveme pĕddabĕddayĕlum̐gula
yīrīdim̐ badimuṁdara yĕmmĕlu gāvā
(||sĕllu||)
bachchĕnanīravvalu pagabaganīnavvulu
nichchalu nichchalu nīve nerisidive
yichchaḍa śhrīveṁkaḍeśhu nĕnasidi vim̐kaneme
gachchu lādanivŏdda ghanadalu gāvā