చెల్లుబడిగలవారు సేసినదే చెల్లుఁగాక
(॥పల్లవి॥)
చెల్లుబడిగలవారు సేసినదే చెల్లుఁగాక
వొళ్లఁ గల సాజాలకు నొద్దనేవా రెవ్వరు
(॥చెల్లు॥)
కక్కసించి నీ పై కాఁకలు చల్లఁగ నీకు
చిక్కనిసెలవినవ్వు చేఁగ లెక్కీని
యిక్కువనీ నాసంది యెండలు వెన్నెలలూను
వొక్కమాటే కాయఁజొచ్చె నొద్దనేవా రెవ్వరు
(॥చెల్లు॥)
ఆరీతి నే నింత వుస్సురస్సు రనఁగా నీకు
చేరువ జాణతనాలు చిమ్మి రేఁగీని
నేరుపున నీ నా సంది నిజములుఁ గల్లలూను
వూరటగా వియ్యమందె నొద్దనేవా రెవ్వరు
(॥చెల్లు॥)
వేడుక నేఁ గాఁగిలించేవేళనే పైపై నీకు
తోడనే పరవశాలు దొమ్మిరేఁచీని
కూడినశ్రీవేంకటేశ గురిఁ గలువయుఁ దామెఁ
రోడ కొక్కపరె పూచె నొద్దసేవా రెవ్వరు
(||pallavi||)
sĕllubaḍigalavāru sesinade sĕllum̐gāga
vŏḽlam̐ gala sājālagu nŏddanevā rĕvvaru
(||sĕllu||)
kakkasiṁchi nī pai kām̐kalu sallam̐ga nīgu
sikkanisĕlavinavvu sem̐ga lĕkkīni
yikkuvanī nāsaṁdi yĕṁḍalu vĕnnĕlalūnu
vŏkkamāḍe kāyam̐jŏchchĕ nŏddanevā rĕvvaru
(||sĕllu||)
ārīdi ne niṁta vussurassu ranam̐gā nīgu
seruva jāṇadanālu simmi rem̐gīni
nerubuna nī nā saṁdi nijamulum̐ gallalūnu
vūraḍagā viyyamaṁdĕ nŏddanevā rĕvvaru
(||sĕllu||)
veḍuga nem̐ gām̐giliṁcheveḽane paibai nīgu
toḍane paravaśhālu dŏmmirem̐sīni
kūḍinaśhrīveṁkaḍeśha gurim̐ galuvayum̐ dāmĕm̐
roḍa kŏkkabarĕ pūsĕ nŏddasevā rĕvvaru