Sellubadigalanaamde semtalinnee namarunu

చెల్లుబడిగలనాఁడే చేఁతలిన్నీ నమరును
Language

(॥పల్లవి॥)
చెల్లుబడిగలనాఁడే చేఁతలిన్నీ నమరును
చల్లఁగా నిప్పుడే నీ సలిగె మెఱయవే

(॥చెల్లు॥)
పచ్చిదేరె సిగ్గులు పట్టరాదు యెగ్గులు
మచ్చిక నాతనితోనే మాలటాడవే
రచ్చకెక్కె గరువము రతి కిదె పరువము
వచ్చినాఁడు పతి నిట్టె వలపించుకొనవే

(॥చెల్లు॥)
వెలసె నీనవ్వులు వెంగే లిఁక దవ్వులు
చలివాసె నిఁక సరసములాడవే
తలకొనెఁ బొదులు దక్కె మోవివిందుట
కలుపుకోలు సేసుక కాఁగిలించుకొనవే

(॥చెల్లు॥)
నెట్టుకొనెఁ జూపులు నిండెఁ దరితీపులు
దట్టమై యీతని కిఁకఁ దమిరేఁచవే
అట్టె శ్రీవేంకటేశుఁ డల మేలుమంగను
గుట్టుపడ నన్నుఁ గూడెఁ గోరి మెచ్చఁగదనే

(||pallavi||)
sĕllubaḍigalanām̐ḍe sem̐talinnī namarunu
sallam̐gā nippuḍe nī saligĕ mĕṟayave

(||sĕllu||)
pachchiderĕ siggulu paṭṭarādu yĕggulu
machchiga nādanidone mālaḍāḍave
rachchagĕkkĕ garuvamu radi kidĕ paruvamu
vachchinām̐ḍu padi niṭṭĕ valabiṁchugŏnave

(||sĕllu||)
vĕlasĕ nīnavvulu vĕṁge lim̐ka davvulu
salivāsĕ nim̐ka sarasamulāḍave
talagŏnĕm̐ bŏdulu dakkĕ moviviṁduḍa
kalubugolu sesuga kām̐giliṁchugŏnave

(||sĕllu||)
nĕṭṭugŏnĕm̐ jūbulu niṁḍĕm̐ daridībulu
daṭṭamai yīdani kim̐kam̐ damirem̐save
aṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍala melumaṁganu
guṭṭubaḍa nannum̐ gūḍĕm̐ gori mĕchcham̐gadane