Sellubadi yimtagaam jesidivammaa

చెల్లుబడి యింతగాఁ జేసితివమ్మా
Language

(॥పల్లవి॥)
చెల్లుబడి యింతగాఁ జేసితివమ్మా
పల్లదాన నుట్లకుఁ బండుగాయనమ్మా

(॥చెల్లు॥)
కోలలెత్తుక వుట్లు గొట్టీ నేఁ డల్లవాఁడె
మేలు మేలు యశోద మీబాలుఁడు
బాలులఁ గూడుక వీదిఁ బారాడి నల్లవాఁడె
బేలుఁదనమున లెస్స పెంచితివోయమ్మా

(॥చెల్లు॥)
ఇంటివారు వుండఁగానే యిండ్లు చొచ్చీ వాఁడె
దంటతనా లివి మీకు తగునమ్మా
అంటఁబారి పట్టుకొంటే ఆయములు దాఁకించె
జుంటితేనేమోవు లివి చూడవమ్మా

(॥చెల్లు॥)
కాదుగూడదనఁబోతే కాఁగిలించీ నిదె వీఁదె
ఆదెస నీదేఁటినవ్వు లవునమ్మా
సాదై శ్రీ వేంకటాద్రి సరసమాడీనమ్మా
యీదెస మమ్మిటు గూడె నేమిచెప్పేమమ్మా

(||pallavi||)
sĕllubaḍi yiṁtagām̐ jesidivammā
palladāna nuṭlagum̐ baṁḍugāyanammā

(||sĕllu||)
kolalĕttuga vuṭlu gŏṭṭī nem̐ ḍallavām̐ḍĕ
melu melu yaśhoda mībālum̐ḍu
bālulam̐ gūḍuga vīdim̐ bārāḍi nallavām̐ḍĕ
belum̐danamuna lĕssa pĕṁchidivoyammā

(||sĕllu||)
iṁṭivāru vuṁḍam̐gāne yiṁḍlu sŏchchī vām̐ḍĕ
daṁṭadanā livi mīgu tagunammā
aṁṭam̐bāri paṭṭugŏṁṭe āyamulu dām̐kiṁchĕ
juṁṭidenemovu livi sūḍavammā

(||sĕllu||)
kādugūḍadanam̐bode kām̐giliṁchī nidĕ vīm̐dĕ
ādĕsa nīdem̐ṭinavvu lavunammā
sādai śhrī veṁkaḍādri sarasamāḍīnammā
yīdĕsa mammiḍu gūḍĕ nemisĕppemammā