Sellubadi gaddamtaam jesevu gaani

చెల్లుబడి గద్దంటాఁ జేసేవు గాని
Language

(॥పల్లవి॥)
చెల్లుబడి గద్దంటాఁ జేసేవు గాని
వొల్లమన్నాఁ బోరు సుమ్మీ వుద్దండమైనాను

(॥చెల్లు॥)
చిట్లుగురుగులతో చిలుపాలు గొల్లెతలు
వుట్లపైఁ బెట్టినారు వోకృఁష్టుడా
కొట్లుగొట్టేవు నీవు గోపాలకులఁ గూడి
తిట్లు దిట్టేరుసుమ్మీ దేవరవై నాను

(॥చెల్లు॥)
అట్టువపైఁ జక్కిలాలు అట్లును నురుగులు
కట్టిపెట్టి దాచినా రిక్కడఁ గృష్టుఁడా
మెట్టుకొని కొల్లలాడి మెఱసేవు వీదులను
పట్టుకోనే రిఁకఁ జుమ్మీ బల్లిదుఁడవైనాను

(॥చెల్లు॥)
తోవల తేనెలు నేయి దొంతులుగఁ బోట్టినారు
శ్రీవేంకటాద్రిమీఁది చిన్ని కృష్టుఁడా
వావారి జోరునవచ్చి వంచి ముంచి పోసేవు
పోవిడువ రేలికవై పోకులఁబోయినాను

(||pallavi||)
sĕllubaḍi gaddaṁṭām̐ jesevu gāni
vŏllamannām̐ boru summī vuddaṁḍamainānu

(||sĕllu||)
siṭlugurugulado silubālu gŏllĕdalu
vuṭlabaim̐ bĕṭṭināru vokṛm̐ṣhṭuḍā
kŏṭlugŏṭṭevu nīvu gobālagulam̐ gūḍi
tiṭlu diṭṭerusummī devaravai nānu

(||sĕllu||)
aṭṭuvabaim̐ jakkilālu aṭlunu nurugulu
kaṭṭibĕṭṭi dāsinā rikkaḍam̐ gṛṣhṭum̐ḍā
mĕṭṭugŏni kŏllalāḍi mĕṟasevu vīdulanu
paṭṭugone rim̐kam̐ jummī ballidum̐ḍavainānu

(||sĕllu||)
tovala tenĕlu neyi dŏṁtulugam̐ boṭṭināru
śhrīveṁkaḍādrimīm̐di sinni kṛṣhṭum̐ḍā
vāvāri jorunavachchi vaṁchi muṁchi posevu
poviḍuva religavai pogulam̐boyinānu