Sellubadee kallaladasemta livi neeviyada

చెల్లుబడీ కల్లలటచేఁత లివి నీవియట
Language

(॥పల్లవి॥)
చెల్లుబడీ కల్లలటచేఁత లివి నీవియట
బల్లిదుఁడ హరి మమ్ము భ్రమ దెలుపవయ్యా

(॥చెల్లు॥)
వొకసస్యమునఁ బంట వొకకోటి కొండ లట
వొకపశువునందు పాలూరేదట
ఆకట కొందరవి అంతలో చవిగొనిన
సకలంబు దీరు నట నటకు నిజ మేదీ

(॥చెల్లు॥)
అన్నంబు గొనెడిదట యప్పటి నాఁకలి యట
తిన్ననై కొంతదడవు తృప్తి నటా
కన్నులనే నిద్ర లట కడఁగి మేల్కనుట యట
యిన్ని బొంకుల జగము యెట్ల నమ్మెడిది

(॥చెల్లు॥)
కాయమట ప్రాయమట కాంతలట పురుషులట
రాయడింపులె మతికి రతిసుఖ మటా
యేయెడల శ్రీవేంకటేశ నీ మాయలివి
పాయునట నీ దాసపరికరములకును

(||pallavi||)
sĕllubaḍī kallalaḍasem̐ta livi nīviyaḍa
ballidum̐ḍa hari mammu bhrama dĕlubavayyā

(||sĕllu||)
vŏgasasyamunam̐ baṁṭa vŏgagoḍi kŏṁḍa laḍa
vŏgabaśhuvunaṁdu pālūredaḍa
āgaḍa kŏṁdaravi aṁtalo savigŏnina
sagalaṁbu dīru naḍa naḍagu nija medī

(||sĕllu||)
annaṁbu gŏnĕḍidaḍa yappaḍi nām̐kali yaḍa
tinnanai kŏṁtadaḍavu tṛpti naḍā
kannulane nidra laḍa kaḍam̐gi melganuḍa yaḍa
yinni bŏṁkula jagamu yĕṭla nammĕḍidi

(||sĕllu||)
kāyamaḍa prāyamaḍa kāṁtalaḍa puruṣhulaḍa
rāyaḍiṁpulĕ madigi radisukha maḍā
yeyĕḍala śhrīveṁkaḍeśha nī māyalivi
pāyunaḍa nī dāsabarigaramulagunu