Sellu nee vamdugu nimta seyavaladaa

చెల్లు నీ వందుకు నింత సేయవలదా
Language

(॥పల్లవి॥)
చెల్లు నీ వందుకు నింత సేయవలదా
కల్లగాదు నీవల్లనే కంటిమి యీ నేరుపు

(॥చెల్లు॥)
చెక్కు నొక్కి నీవద్ది చెలియకు నింతలోనే
పుక్కిటి తమ్ములమిడి బుజ్జగించేవు
ఇక్కువ నెవ్వతనైనా ఇంటికి రమ్మంటివో
వొక్కమాటే యీపె నింత వొడఁబరచేవు

(॥చెల్లు॥)
దొడ్డసొమ్ములెల్లాఁ బెట్టి తొడిఁబడ నప్పటికి
వెడ్డువెట్టి సారెసారె వేఁడుకొనేవు
అడ్డమై వేరొకతె నిన్నాసలఁ బెట్టినదో
వొడ్డుకొనకుండా వింత వొడఁబరచేవు

(॥చెల్లు॥)
సన్నలు నాకుఁ జేసి సరి నిట్టె యీకెఁ గూడి
మిన్నక యెంతేసినమ్మిక లిచ్చేవు
ఇన్నిటా శ్రీవేంకటేశ యే నలుమేలుమంగను
వున్నతిఁ జనవులిచ్చి వొడఁబరచేవు

(||pallavi||)
sĕllu nī vaṁdugu niṁta seyavaladā
kallagādu nīvallane kaṁṭimi yī nerubu

(||sĕllu||)
sĕkku nŏkki nīvaddi sĕliyagu niṁtalone
pukkiḍi tammulamiḍi bujjagiṁchevu
ikkuva nĕvvadanainā iṁṭigi rammaṁṭivo
vŏkkamāḍe yībĕ niṁta vŏḍam̐barasevu

(||sĕllu||)
dŏḍḍasŏmmulĕllām̐ bĕṭṭi tŏḍim̐baḍa nappaḍigi
vĕḍḍuvĕṭṭi sārĕsārĕ vem̐ḍugŏnevu
aḍḍamai verŏgadĕ ninnāsalam̐ bĕṭṭinado
vŏḍḍugŏnaguṁḍā viṁta vŏḍam̐barasevu

(||sĕllu||)
sannalu nāgum̐ jesi sari niṭṭĕ yīgĕm̐ gūḍi
minnaga yĕṁtesinammiga lichchevu
inniḍā śhrīveṁkaḍeśha ye nalumelumaṁganu
vunnadim̐ janavulichchi vŏḍam̐barasevu