చెల్లు నయ్యా నీవు సేసే చేఁత లెల్లాను
(॥పల్లవి॥)
చెల్లు నయ్యా నీవు సేసే చేఁత లెల్లాను
వుల్లస మే మాడినాను వొద్దనేమా నిన్నును
(॥॥)
మోము చూచితే నవ్వేవు మొక్కితే దీవించేవు
యేమయ్యా నీ జాణతనా లెన్ని గలవు
కామినుల వలపింత కాఁకాయ నీ వల్లను
గామిడితనా లివి యక్కడ నేర్చుకొంటివో
(॥॥)
చేరితేనే చెనకేవు సిగ్గు పడితేఁ దిట్టేవు
నేరమయ్యా నేము నీతో నేసాలు సేయ
దూరు కెక్కిరి నీ చేత తొల్లే గొల్లెతలెల్లా
యీరీతి విద్యలు నీకు నింకా నెన్ని గలవో
(॥॥)
సొలసితేఁ గూడేవు చొక్కితేనే మెచ్చేవు
నిలిచె నయ్యా నీ నెయ్యములెల్లా
అలరి శ్రీ వేంకటేశ అన్నిటా నన్నేలితివి
కలిగె నీ కీ గుణా లెక్కడఁ గాచుకుండెనో
(||pallavi||)
sĕllu nayyā nīvu sese sem̐ta lĕllānu
vullasa me māḍinānu vŏddanemā ninnunu
(||||)
momu sūside navvevu mŏkkide dīviṁchevu
yemayyā nī jāṇadanā lĕnni galavu
kāminula valabiṁta kām̐kāya nī vallanu
gāmiḍidanā livi yakkaḍa nersugŏṁṭivo
(||||)
seridene sĕnagevu siggu paḍidem̐ diṭṭevu
neramayyā nemu nīdo nesālu seya
dūru kĕkkiri nī seda tŏlle gŏllĕdalĕllā
yīrīdi vidyalu nīgu niṁkā nĕnni galavo
(||||)
sŏlasidem̐ gūḍevu sŏkkidene mĕchchevu
nilisĕ nayyā nī nĕyyamulĕllā
alari śhrī veṁkaḍeśha anniḍā nannelidivi
kaligĕ nī kī guṇā lĕkkaḍam̐ gāsuguṁḍĕno