చెల్లు లేవే యాతఁడు నీచేతఁ జిక్కెనే
(॥పల్లవి॥)
చెల్లు లేవే యాతఁడు నీచేతఁ జిక్కెనే
పల్లదమే తల్లి నీకుఁ బాలతోనే పోసెనే
(॥చెల్లు లేవే॥)
తెగువలు వచరించ తేనెలమాట లాడ
పగటుల నడవ నీపాలఁ బోయనే
మొగమిచ్చలు నెరవ ముసిముసినవ్వు నవ్వ
తగవులఁ బెట్ట నీకు తతి వచ్చెనే
(॥చెల్లు లేవే॥)
సారెకు మొక్కులు మొక్క చలములు సాదించ
ఆరీతి నాన వట్టె నీ కలవా ట్లాయనే
నేర మొకరిపై వేయే నీచేయి మీఁదు సేయ
నేరుపు నాలితానలు నీ వియ్య వలెనే
(॥చెల్లు లేవే॥)
అరగపటము చూప నంతలోఁ దిరుగ వేయ
సరిఁ జిన్ననాఁడె యిన్ని సాధించితివే
గరిమ శ్రీవెంకటేశుఁ గలసి న న్నే లించితి
సరి వచ్చితే మెచ్చ జాణ వైతివే
(||pallavi||)
sĕllu leve yādam̐ḍu nīsedam̐ jikkĕne
palladame talli nīgum̐ bāladone posĕne
(||sĕllu leve||)
tĕguvalu vasariṁcha tenĕlamāḍa lāḍa
pagaḍula naḍava nībālam̐ boyane
mŏgamichchalu nĕrava musimusinavvu navva
tagavulam̐ bĕṭṭa nīgu tadi vachchĕne
(||sĕllu leve||)
sārĕgu mŏkkulu mŏkka salamulu sādiṁcha
ārīdi nāna vaṭṭĕ nī kalavā ṭlāyane
nera mŏgaribai veye nīseyi mīm̐du seya
nerubu nālidānalu nī viyya valĕne
(||sĕllu leve||)
aragabaḍamu sūba naṁtalom̐ diruga veya
sarim̐ jinnanām̐ḍĕ yinni sādhiṁchidive
garima śhrīvĕṁkaḍeśhum̐ galasi na nne liṁchidi
sari vachchide mĕchcha jāṇa vaidive