Sellinatlu neeve semta seduvu gaaga

చెల్లినట్లు నీవే చేఁత సేతువు గాక
Language

(॥పల్లవి॥)
చెల్లినట్లు నీవే చేఁత సేతువు గాక
యెల్లి నేఁడనే జాగు లింకానేలే

(॥చెల్లి॥)
చెక్కులెల్లాఁ జెమరించె సేసకొప్పు వెడజారె
యిక్కడ నాతోఁ గోప మింకానేలే
మొక్కు నాచేతికి వచ్చె మోవి నీకు నవ్వు చిందె
యెక్కువ వెంగెపుమాట లింకానేలే

(॥చెల్లి॥)
తనువెల్లాఁ బులకించె తగునిట్టూర్పులు రేఁగె
యినుమడించినచల మింకానేలే
మును నాపంతము వచ్చె మొగి నీసిగ్గులు మించె
యెనలేనియనుమాన మింకానేలే

(॥చెల్లి॥)
వలపు కాఁగిట కెక్కె వాసులురేసులు నిక్కె
యెలయింపుఁ గసరులు యింకానేలే
బలిమి శ్రీ వేంకటాద్రిపతి నేఁ గూడితి నిన్ను
యెలుఁగెత్తి రట్టుసేయ నింకానేలే

(||pallavi||)
sĕllinaṭlu nīve sem̐ta seduvu gāga
yĕlli nem̐ḍane jāgu liṁkānele

(||sĕlli||)
sĕkkulĕllām̐ jĕmariṁchĕ sesagŏppu vĕḍajārĕ
yikkaḍa nādom̐ goba miṁkānele
mŏkku nāsedigi vachchĕ movi nīgu navvu siṁdĕ
yĕkkuva vĕṁgĕbumāḍa liṁkānele

(||sĕlli||)
tanuvĕllām̐ bulagiṁchĕ taguniṭṭūrbulu rem̐gĕ
yinumaḍiṁchinasala miṁkānele
munu nābaṁtamu vachchĕ mŏgi nīsiggulu miṁchĕ
yĕnaleniyanumāna miṁkānele

(||sĕlli||)
valabu kām̐giḍa kĕkkĕ vāsuluresulu nikkĕ
yĕlayiṁpum̐ gasarulu yiṁkānele
balimi śhrī veṁkaḍādribadi nem̐ gūḍidi ninnu
yĕlum̐gĕtti raṭṭuseya niṁkānele