Sellinamtayu neevu seduvu gaaga

చెల్లినంతయు నీవు సేతువు గాక
Language

(॥పల్లవి॥)
చెల్లినంతయు నీవు సేతువు గాక
మొల్లంపు నీ చేఁత ముయికిముయి గాదా

(॥చెల్లి॥)
ప్రేమమున నంటఁగాఁ బెనఁగే వవుర నీ-
దీమసం బెట్టిదో తెలియఁగలదు
వేమారు నీకింత వేగితేఁ జాలుఁగా-
కేమాయ నుప్పొలి కినుమడేకాదా

(॥చెల్లి॥)
పిలువనంపిన రాక బిగిసితి విందాఁక నీ-
అలరుఁదలంపెట్టిదో అడుగఁగలదు
నిలుకడై నీమనసు నిల్చితేఁ జాలుఁగాక
వలపు వేయింటిపై జవ్వాదికొమ్ముగాదా

(॥చెల్లి॥)
కాఁగిలించిన నపుడె కరఁగేవు నీతొంటి-
నాఁగుఁజలములకు నిది నవ్వుగాదా
వీఁగ కిటు నన్ను శ్రీవేంకటేశ కూడితివి
రేఁగితివి గోర గీరిన నేరుగాదా

(||pallavi||)
sĕllinaṁtayu nīvu seduvu gāga
mŏllaṁpu nī sem̐ta muyigimuyi gādā

(||sĕlli||)
premamuna naṁṭam̐gām̐ bĕnam̐ge vavura nī-
dīmasaṁ bĕṭṭido tĕliyam̐galadu
vemāru nīgiṁta vegidem̐ jālum̐gā-
kemāya nuppŏli kinumaḍegādā

(||sĕlli||)
piluvanaṁpina rāga bigisidi viṁdām̐ka nī-
alarum̐dalaṁpĕṭṭido aḍugam̐galadu
nilugaḍai nīmanasu nilsidem̐ jālum̐gāga
valabu veyiṁṭibai javvādigŏmmugādā

(||sĕlli||)
kām̐giliṁchina nabuḍĕ karam̐gevu nīdŏṁṭi-
nām̐gum̐jalamulagu nidi navvugādā
vīm̐ga kiḍu nannu śhrīveṁkaḍeśha kūḍidivi
rem̐gidivi gora gīrina nerugādā