చెల్లెఁ జెల్లెఁ బనులెల్లఁ జేఁత లింకేలే
(॥పల్లవి॥)
చెల్లెఁ జెల్లెఁ బనులెల్లఁ జేఁత లింకేలే
కొల్లలాయ వలపులు కొసరు లింకేఁటికే
(॥చెల్లెఁ॥)
చెక్కిట, బెట్టిన చేత సేసవెట్టితివి నీవు
యెక్కడా రమణి నీకు నేలే చింత
ముక్కునబుట్టినవేల ముదమంది మెచ్చితివి
చక్కనాయ, బనులెల్ల జాణతనా లేఁటికే
(॥చెల్లెఁ॥)
తిట్టిన పెదవిపైనే తేటనవ్వు లచె నిండె
పట్టినచలము చెల్లె బదరనేలే
కొట్టఁగొన తలులు కోరి మొదలికి వచ్చె
చుట్టువరుస మించె సోఁకనాడనేఁటికే
(॥చెల్లెఁ॥)
వాడిన వదనమున వడి గళలెల్లా నిండె
వేడుకలే దైవారె వేసట లేలే
కూడితి శ్రీవేంకటేశు గూరిమి గడపలోన
పాడిఁబంతాలెల్లఁజెల్లె పచ్చిసేయ నేఁటికే
(||pallavi||)
sĕllĕm̐ jĕllĕm̐ banulĕllam̐ jem̐ta liṁkele
kŏllalāya valabulu kŏsaru liṁkem̐ṭige
(||sĕllĕm̐||)
sĕkkiḍa, bĕṭṭina seda sesavĕṭṭidivi nīvu
yĕkkaḍā ramaṇi nīgu nele siṁta
mukkunabuṭṭinavela mudamaṁdi mĕchchidivi
sakkanāya, banulĕlla jāṇadanā lem̐ṭige
(||sĕllĕm̐||)
tiṭṭina pĕdavibaine teḍanavvu lasĕ niṁḍĕ
paṭṭinasalamu sĕllĕ badaranele
kŏṭṭam̐gŏna talulu kori mŏdaligi vachchĕ
suṭṭuvarusa miṁchĕ som̐kanāḍanem̐ṭige
(||sĕllĕm̐||)
vāḍina vadanamuna vaḍi gaḽalĕllā niṁḍĕ
veḍugale daivārĕ vesaḍa lele
kūḍidi śhrīveṁkaḍeśhu gūrimi gaḍabalona
pāḍim̐baṁtālĕllam̐jĕllĕ pachchiseya nem̐ṭige